hyderabadupdates.com Gallery తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం

తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం

తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం post thumbnail image

తిరుమ‌ల‌: తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు టీటీడీ సీవీ ఎస్‌ఓ మురళీకృష్ణ ఆదేశాల మేర‌కు పోలీసులు తిరుమ‌ల‌లో నాఖా బందీ చేప‌ట్టారు. గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వ‌హించారు.58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ చేశారు. 6 షాపులకు నోటీసులు ఇచ్చారు. న‌లుగురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు .2 వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులపై హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ వజ్రపహార్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు. భక్తుల భద్రతకు భంగం కలిగించే విధంగా నిషేధిత వస్తువులు వినియోగించరాదని స్ప‌ష్టం చేశారు. గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను తీసుకు రావడం, వినియోగించడం చేయరాదని అన్నారు. షాపులలో పనిచేసే సిబ్బందికి కఠినంగా సూచనలు చేశారు.
పోలీస్ సహా పలు విభాగాల 58 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి షాపులను తనిఖీ చేశారు. లైసెన్సులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని 6 షాపులకు నోటీసులు జారీ చేయగా, సరైన గుర్తింపు లేని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత వస్తువుల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, షాపులు నిబంధనల ప్రకారం నడపాలని, అపరిచితులకు ఇవ్వకూడదని సూచించారు. అత్యవసర నంబర్లు 112, 1972 పై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.
The post తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం

అమరావతి : అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. ఆర్డీటీ

CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్

CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అన్ని

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందిరాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పిచోడి చేతిలో రాయిలాగా అయి పోయింద‌న్నారు. ఇది భూసేకర కాద‌ని, దళిత బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దండయాత్ర అని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ప‌రిగి