hyderabadupdates.com Gallery హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్

హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్

హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్ post thumbnail image

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు చేసిన కామెంట్స్ పై . ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని , అలా వెల్ల‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ఇద్దరు కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. మ‌రి గతంలో హరీష్ రావు వేరే పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లలేదా..? అని ప్ర‌శ్నించారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి.
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని క్రాస్ బీడ్ అంటున్న హరీష్ రావుకు సోయి లేద‌న్నారు ఎంపీ. క్రాస్ బీడ్, క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది బీఆర్ఎస్ కాదా అని నిల‌దీశారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని హరీష్ రావు క‌ల‌లు క‌న్నాడ‌ని ఎద్దేవా చేశారు. మా మామ కేసీఆర్ తర్వాత నేను సీఎం అవుతా లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారని హరీష్ రావు భావించారని కానీ అది వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు. రోజూ ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని , ఇది మానుకోవాల‌ని సూచించారు.
The post హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం

హైదరాబాద్ : భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తాఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేతో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న 11 ఏళ్ల

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లుమాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో మ‌ద్యం స్కాంకు సంబంధించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు