hyderabadupdates.com Gallery తేజ‌స్వి సూర్య కామెంట్స్ హ‌రీష్ రావు సీరియ‌స్

తేజ‌స్వి సూర్య కామెంట్స్ హ‌రీష్ రావు సీరియ‌స్

తేజ‌స్వి సూర్య కామెంట్స్ హ‌రీష్ రావు సీరియ‌స్ post thumbnail image

జ‌గిత్యాల జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య తెలంగాణ ప్రాంతం ప‌ట్ల చేసిన కామెంట్స్ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా వ‌ళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని, లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో లేని లోటు కనిపించిందన్నారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు ధీటైన సమాధానం చెప్పి ఉండే వాళ్లం అన్నారు హ‌రీశ్ రావు. ఇప్పటికైనా తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు ముడి పెట్టారని ప్ర‌శ్నించారు. 2/3 మెజార్టీ లేదని స్పష్టంగా తెలిసినా రాజకీయం కోసమే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వని కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టిఫిన్ కోసం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్తారంటూ ఎద్దేవా చేశారు. క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో రేవంత్ రెడ్డి చేసే హైబ్రిడ్ పనులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అర్థం అవుతున్నాయో లేదో తెలియడం లేదన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు. రాహుల్ విధానంతో కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా అని నిల‌దీశారు.
The post తేజ‌స్వి సూర్య కామెంట్స్ హ‌రీష్ రావు సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మంగళవారం ఘట్కేసర్ చేరుకున్న సీఎం… అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని ఓదార్చారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు.

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది.

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

    బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌