అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకు రావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ, ఆర్ధిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందు కోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియోగించు కోవాలన్నారు సీఎం.
The post త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ
Categories: