hyderabadupdates.com Gallery త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్

త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్

త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌పై ప‌డింది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు బీజేపీయేత‌ర పార్టీలు ప్ర‌స్తుతం కొలువు తీరి ఉన్నాయి. త‌మిళ‌నాడులో డీఎంకే , కాంగ్రెస్ ఇండియా కూట‌మి ప‌వ‌ర్ లో ఉండ‌గా టీఎంసీ పార్టీ ఆధ్వ‌ర్యంలో బెంగాల్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఎవ‌రు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఏప్రిల్ 23న త‌మిళ‌నాడులోని 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం 4,023 మంది బ‌రిలో ఉన్నారు. 85,875 మంది పోలీసులతో భద్రత కొన‌సాఉతోంది. ఇదిలా ఉండ‌గా తమిళనాడులో ఓటు వేయనున్నారు 5.73 కోట్ల మంది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ 75,064 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈసారి కొత్త‌గా ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే బ‌రిలోకి దిగింది. త‌న ల‌క్ ను ప‌రీక్షించు కోనున్నారు. మ‌రో వైపు ప‌వ‌ర్ లో ఉన్న డీఎంకే మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తంది. ఇంకో వైపు అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీఏ కూట‌మి ఈసారి ప‌క్కా త‌మ‌దే రాజ్యం అని అంటోంది.
మ‌రో వైపు బీజేపీ ఛాలెంజింగ్ గా తీసుకుంది ఈసారి ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను. త‌మిళ‌నాడులో తీవ్ర వివాదాస్ప‌దంగా మారిన గ‌వ‌ర్న‌ర్ ర‌విని తీసుకు వెళ్లి బెంగాల్ గవ‌ర్న‌ర్ గా నియ‌మించింది. అక్క‌డ కూడా ఆయ‌న సీఎం దీదీ పాలిట శాపంగా మారారు. అయినా ఆమె డోంట్ కేర్ అంటోంది. ఈ త‌రుణంలో అంద‌రి దృష్టి బెంగాల్ పై ప‌డింది. త‌మిళ‌నాడులో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుగుతుండ‌గా ప‌శ్చిమ బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా రెండు విడత‌లుగా జ‌రుగుతుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇవాళ 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలలో పోలింగ్ కొన‌సాగుతోంది. ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు ఉన్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత కొన‌సాగుతోంది.
8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్న‌ట్లు గుర్తించారు.
The post త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిలఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు

తీయ‌ని మాట‌లు కాదు నిలువునా దోచేసే సైబ‌ర్ కేటుగాళ్లుతీయ‌ని మాట‌లు కాదు నిలువునా దోచేసే సైబ‌ర్ కేటుగాళ్లు

హైద‌రాబాద్ : న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న యాప్స్ యాడ్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్