hyderabadupdates.com Gallery త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ

త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ

త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ post thumbnail image

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకు రావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ, ఆర్ధిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందు కోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియోగించు కోవాలన్నారు సీఎం.
The post త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

న్యూఢిల్లీ : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పులికాట్ సరస్సులో సుమారు 20 వేల మంది సంప్రదాయ మత్స్యకారులు గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రస్తావించారు. రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో

దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలిదర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి

హైద‌రాబాద్ : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.

CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదలCM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల

CM Nitish Kumar : బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు (CM Nitish Kumar) చెందిన జనతాదళ్ యునైటెడ్