hyderabadupdates.com movies ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు సెలవులు కలిసి రావడం వల్ల థియేటర్లకు కలెక్షన్లు బాగుంటాయి. అందుకే పెద్దికి ఏప్రిల్ 30 ఫిక్స్ చేసుకున్నారు. కానీ బ్యాడ్ లక్ వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు రీ రికార్డింగ్ పెండింగ్ వల్ల ఏకంగా జూన్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెద్ది తప్పుకున్న అవకాశాన్ని సత్య జెట్లీ, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం వాడుకుంటున్నాయి.

కానీ అసలు ఛాన్స్ కొట్టేసింది మాత్రం ధనుష్ కర అని చెప్పాలి. పెద్ది వదులుకున్న డేట్ కే రానున్న ఈ మూవీ ట్రైలర్ నిన్న రిలీజయ్యింది. గల్ఫ్ యుద్ధం వల్ల సంక్షోభం ఏర్పడినప్పుడు పెద్ద ఎత్తున డబ్బు అవసరమైన ఒక పల్లెటూరి యువకుడు బ్యాంకులను దోచుకోవడం మొదలుపెడతారు. దీన్ని సవాల్ గా తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ దొంగను పట్టుకునే లక్ష్యంతో నీడలా వెంటాడుతాడు. అసలు హీరో దొంగగా ఎందుకు మారాడనేదే అసలు పాయింట్.

ఏపీ తెలంగాణలో కర పెద్దగా అద్భుతాలు చేయకపోవచ్చు కానీ పెద్ది మిస్ చేసుకోవడం వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ధనుష్ కు చాలా పేద అడ్వాంటేజ్ దక్కనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ హీస్ట్ థ్రిల్లర్ కు దర్శకుడు విగ్నేష్ రాజా. విజువల్స్ గట్రా చూస్తుంటే కర్ణన్, అమరన్ ఛాయలు కనిపిస్తున్నాయి కానీ దొంగతనం బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి.

ఇక ధనుష్ ట్రాక్ రికార్డు విషయానికి వస్తే ఇడ్లి కొట్టు తమిళంలో ఓ మోస్తరుగా డబ్బులు తెచ్చినా ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా సార్ వల్ల తెలుగులో ఏర్పడిన మార్కెట్ ఫ్లాపుల వల్ల డౌన్ అవుతోంది. దీన్ని కర ఎంతమేరకు నిలబెడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. నేటివిటీ సమస్య వస్తే మటుకు మన ప్రేక్షకులకిది కనెక్ట్ కాదు. విక్రమ్ వీరధీర సూరన్ ఇదే సమస్య వల్ల తెలుగులో కనీస స్థాయిలో ఆడలేదు. మరి కర  దీన్నేమైనా మారుస్తాడేమో చూడాలి.

Related Post

గూగుల్ రాక: జనాలకు మేలెంత?గూగుల్ రాక: జనాలకు మేలెంత?

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో

Why “I’m Still Here” Will Always Be a Powerful WatchWhy “I’m Still Here” Will Always Be a Powerful Watch

Walter Salles’ “I’m Still Here,” which won the Best International Feature Film Oscar earlier this year, calmly but powerfully observes a real-life personal struggle under a dictatorship in Brazil during