hyderabadupdates.com movies ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు విస్తృతంగా చేశాయి. గివ్ అవే టికెట్లు ఇచ్చి మరీ సోషల్ మీడియా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ ఇవాళ బుక్ మై షో ఓపెన్ చేస్తే కనీసం ట్రెండింగ్ లో కూడా లేకపోవడం విచిత్రం. ట్వీట్లు, మీమ్స్ లో చూపించిన పొగడ్తలు, వీడియోలకు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కాదు కదా కనీసం సగం కూడా నిండలేదని ట్రేడ్ రిపోర్ట్.

అనూహ్యంగా రెండో వారంలో అడుగు పెట్టిన డెకాయిట్ పెర్ఫార్మన్స్ బాగుండటం కొంత రిలీఫ్ ఇచ్చింది. ఏ తెలుగు సినిమాకు లేనంతగా నిన్న ఒక్కరోజే 21 వేలకు పైగా టికెట్ అమ్మకాలు చేసిన ఈ లవ్ యాక్షన్ డ్రామా పెద్దగా టెన్షన్ పడకుండానే 50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు డిస్ట్రిబ్యూషన్ వర్గాల సమాచారం. అన్నపూర్ణ సంస్థ అధిక శాతం ఏరియాల్లో స్వంతంగా రిలీజ్ చేసుకోవడంతో రికవరీకి సంబంధించి ఎక్కువ నష్టాలు వచ్చే ఛాన్స్ లేదని పంపిణిదారుల మాట.

సో అడివి శేష్ బ్రాండ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మిక్స్డ్ టాక్ తట్టుకుని ఇంత నెంబర్ నమోదు చేయడం వెనుక దర్శకుడి పనితనం కంటే శేష్, మృణాల్ జోడీనే ఎక్కువగా మేజిక్ చేసిందని అనుకోవాలి. ఇక ఇవాళ్టి నుంచి ఆక్యుపెన్సీలు తగ్గుముఖం పడతాయి కానీ నష్టాలు అతి తక్కువే కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. దీనికే ఇలా ఉంటే ఇక బ్యాడ్ బాయ్ కార్తీక్ లాంటివి ఏ స్థాయిలో వాషౌట్ అయ్యుంటాయో వేరే చెప్పనక్కర్లేదు.

ఒకటి మాత్రం నిజం. సమ్మర్ సీజన్ పూర్తి పొటెన్షియల్ వాడుకునే సినిమా ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో పడలేదు. ఐపీఎల్ ని నిర్మాతలు సాకుగా చూపిస్తున్నారు కానీ సరైన కంటెంట్ వస్తే ఆడియన్స్ ఎండలను సైతం లెక్క చేయరని గతంలో చాలాసార్లు ఋజువయ్యింది. అంతెందుకు డెకాయిట్ ఈ టైంలోనే యాభై కోట్లు ఎలా వసూలు చేయగలిగింది. ఫైనల్ గా చెప్పదేంటంటే పెద్ది వచ్చేదాకా అన్నీ మీడియం బడ్జెట్ సినిమాలతో కాలక్షేపం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

Related Post

పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్

వచ్చే ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు పేరున్న సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ తన పుట్టిన రోజే అయిన మార్చి 27కు షెడ్యూల్ అయింది. తర్వాత నాని

టొవినో థామస్ ఇప్పుడెలా స్పందిస్తాడోటొవినో థామస్ ఇప్పుడెలా స్పందిస్తాడో

మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని, ఏడాది పాటు వెయిట్ చేయించే టాలీవుడ్ సినిమాలు తనకు నప్పవని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. టొవినో కొత్త మూవీ