hyderabadupdates.com movies ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు సెలవులు కలిసి రావడం వల్ల థియేటర్లకు కలెక్షన్లు బాగుంటాయి. అందుకే పెద్దికి ఏప్రిల్ 30 ఫిక్స్ చేసుకున్నారు. కానీ బ్యాడ్ లక్ వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు రీ రికార్డింగ్ పెండింగ్ వల్ల ఏకంగా జూన్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెద్ది తప్పుకున్న అవకాశాన్ని సత్య జెట్లీ, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం వాడుకుంటున్నాయి.

కానీ అసలు ఛాన్స్ కొట్టేసింది మాత్రం ధనుష్ కర అని చెప్పాలి. పెద్ది వదులుకున్న డేట్ కే రానున్న ఈ మూవీ ట్రైలర్ నిన్న రిలీజయ్యింది. గల్ఫ్ యుద్ధం వల్ల సంక్షోభం ఏర్పడినప్పుడు పెద్ద ఎత్తున డబ్బు అవసరమైన ఒక పల్లెటూరి యువకుడు బ్యాంకులను దోచుకోవడం మొదలుపెడతారు. దీన్ని సవాల్ గా తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ దొంగను పట్టుకునే లక్ష్యంతో నీడలా వెంటాడుతాడు. అసలు హీరో దొంగగా ఎందుకు మారాడనేదే అసలు పాయింట్.

ఏపీ తెలంగాణలో కర పెద్దగా అద్భుతాలు చేయకపోవచ్చు కానీ పెద్ది మిస్ చేసుకోవడం వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ధనుష్ కు చాలా పేద అడ్వాంటేజ్ దక్కనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ హీస్ట్ థ్రిల్లర్ కు దర్శకుడు విగ్నేష్ రాజా. విజువల్స్ గట్రా చూస్తుంటే కర్ణన్, అమరన్ ఛాయలు కనిపిస్తున్నాయి కానీ దొంగతనం బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి.

ఇక ధనుష్ ట్రాక్ రికార్డు విషయానికి వస్తే ఇడ్లి కొట్టు తమిళంలో ఓ మోస్తరుగా డబ్బులు తెచ్చినా ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా సార్ వల్ల తెలుగులో ఏర్పడిన మార్కెట్ ఫ్లాపుల వల్ల డౌన్ అవుతోంది. దీన్ని కర ఎంతమేరకు నిలబెడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. నేటివిటీ సమస్య వస్తే మటుకు మన ప్రేక్షకులకిది కనెక్ట్ కాదు. విక్రమ్ వీరధీర సూరన్ ఇదే సమస్య వల్ల తెలుగులో కనీస స్థాయిలో ఆడలేదు. మరి కర  దీన్నేమైనా మారుస్తాడేమో చూడాలి.

Related Post

శర్వా ఇలాంటి ప్రయోగాలే చేయాలిశర్వా ఇలాంటి ప్రయోగాలే చేయాలి

ఒకే ఒక జీవితం, మనమే తర్వాత శర్వానంద్ నుంచి బాగా గ్యాప్ వచ్చేసింది. అభిమానులు ఎదురు చూసే కొద్దీ కొత్త సినిమా రానేలేదు. ఇప్పుడు వరసగా రెండు రిలీజులు రెడీ అవుతున్నాయి. వాటిలో మొదటిది బైకర్. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ

Highest Paid Previews for Bollywood in India: Dhurandhar The Revenge is a MAMMOTH at the topHighest Paid Previews for Bollywood in India: Dhurandhar The Revenge is a MAMMOTH at the top

Dhurandhar: The Revenge stormed the Indian box office, amassing Rs. 39 crore nett approx for its paid previews on Wednesday evening. The previous best preview record from Bollywood was with Stree