hyderabadupdates.com Gallery పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి post thumbnail image

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ గోశాలలోని పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, అవసరమైన వైద్య సేవలు అందించాలని స్ప‌ష్టం చేశారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నట్లు తెలిపారు. పశువులను మేత కోసం రోజుకు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు వదలకుండా, ఉదయం ఒకేసారి మేతకు వదిలి సాయంత్రం షెడ్లకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే 13 ఎకరాల్లో పచ్చి మేత అందుబాటులో ఉందని, గోశాలకు అనువైన భూమిని గుర్తించి మరింత విస్తీర్ణంలో పచ్చి గడ్డి సాగు చేయాలని సూచించారు. ప్రతి షెడ్డులో పశువులకు అందిస్తున్న దాణా, షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, వ్యాధుల నివారణకు అందిస్తున్న మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసి బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లల సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, పశువుల సంరక్షణకూ అంతే స్థాయిలో బాధ్యత వహించాలని సూచించారు. పశువులకు తగిన నీడ కల్పించేందుకు విస్తృతంగా చెట్ల మొక్కలు నాటాలని కోరారు.
బెంగుళూరులోని శ్రీ శ్రీ గోశాలను సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు పలమనేరులోని గోశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, పలమనేరు ప్రత్యేక అధికారి డా. చైతన్య, వెటర్నరీ మేనేజర్లు డా. అనిల్ కుమార్, శివ మనోహర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
The post పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుKinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్.

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

    రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు.

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళంగిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

ముంబై : స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో వ‌న్డే సీరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా 15 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. దేశీవాళి