hyderabadupdates.com Gallery పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌ post thumbnail image

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల‌కు భ‌రోసా ఇచ్చారు. పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్ర‌క‌టించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్ కాలనీ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని, డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచన అని డిప్యూటీ సీఎం అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు 22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసింద‌న్నారు. చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అని స్ప‌ష్టం చేశారు. పేదలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆత్మ గౌరవంతో బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి తరతమ భేదం లేకుండా పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు చెప్పారు.
The post పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డిఅట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

అమరావతి : కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ,

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ

రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ 2026-2027 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక బ‌డ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన