hyderabadupdates.com Gallery ​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ

​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ

​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం నుంచి బ‌స్సులు రోడ్డు మీద‌కు రానున్నాయ‌ని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. ఉద్యోగ సంఘాలతో స‌ర్కార్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అయ్యాయ‌ని తెలిపారు. ఇవాళ‌ మొదటి షిఫ్ట్ నుంచి రోడ్డు ఎక్కనున్నాయి తెలంగాణ ప్రగతి రథచక్రాలు అని పేర్కొన్నారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించార‌ని వెల్ల‌డించారు ఎండీ. తెల్లవారు జామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సులు యధావిధిగా నడుస్తున్నాయ‌ని తెలిపారు.
కార్మికుల చిరకాల కోరికైన‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు , ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రక‌టిస్తుంద‌ని పేర్కొన్నారు నాగిరెడ్డి .ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2021 పే స్కేల్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వేతన సవరణ ఉందని తెలిపారు.ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే కార్మిక సంఘాల తో చర్చలు జరిపి విధి విధానాలను ప్రకటించడం జరుగుతుందన్నారు.
గత మూడు రోజులుగా సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోందని అన్నారు. అన్ని డిపోల పరిధిలో వంద శాతం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలని ఎండీ కోరారు.
The post ​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని

పర్యాటకుల కోసం హోటళ్లు, హోంస్టేలు పెంచేలా కార్యాచరణపర్యాటకుల కోసం హోటళ్లు, హోంస్టేలు పెంచేలా కార్యాచరణ

అమరావతి : రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల ఫుట్ ఫాల్‌కు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోం స్టేలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల