దుబాయ్ : భద్రతా కారణాల పేరుతో వచ్చే నెల ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు తమకు ప్రత్యామ్నాయ మైదానాలు కేటాయించాలని లేక పోతే ఆడబోమంటూ మెలిక పెట్టింది. దీంతో టైం దగ్గర పడుతుండడంతో ఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది దుబాయ్ లో. ఈ మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి. ఈ మీటింగ్ లో బీసీబీ అభ్యర్థనకు వ్యతిరేకంగా ఐసీసీ ఓటు వేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు తప్పక ఆడాల్సి ఉంటుంది. ఈ సందర్బంగా ఐసీసీ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుత పరిస్థితులలో మ్యాచ్‌లను మార్చడం వలన ఐసీసీ ఈవెంట్‌ల పవిత్రత దెబ్బతింటుందని , అంతే కాకుండా ప్రపంచ పాలక సంస్థగా సంస్థ తటస్థతకు భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. భారతదేశంలోని ఏ టోర్నమెంట్ వేదికలలోనైనా బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఆడేందుకు తగిన పరిస్థితులు లేవంటూ ఆరోపించింది బీసీబీ. తమ జట్టు ఆడే మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని కోరింది . బంగ్లా దేశ్ చేసిన అభ్యర్థనను నిర్దద్వందంగా తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదంటూ కుండ బద్దలు కొట్టింది. దీంతో తప్పనిసరిగా బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిందే.
ఐసీసీ రూల్స్ ప్రకారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విధిగా టోర్నమెంట్ లో ఆడాల్సిందేనని, వెనక్కి తగ్గ కూడదని పేర్కొంది. ఇదే క్రమంలో పూర్తి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.
The post బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ
Categories: