hyderabadupdates.com Gallery బ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్ది

బ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్ది

బ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్ది post thumbnail image

తిరుమ‌ల : టీటీడీ ఎన్నో సేవ‌లు అందిస్తోంది. విద్య‌, వైద్యం, భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌ల‌ను క‌ల్పిస్తోంది. ఇదిలా ఉండ‌గా మూగ‌, చెవిటి పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా స్కూల్స్, కాలేజీల‌ను నిర్వ‌హిస్తోంది. జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో అప్పట్లో టిటిడి ఛైర్మెన్ సి. అన్నారావు ప్రారంభించారు. దశల వారీగా తరగతులను పెంచుకుంటూ ప్రస్తుతం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీ వేంకటేశ్వర బధిరోన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ లో హెచ్.ఈ.సీ, సీఈసీ గ్రూప్ లతో శ్రీ వేంకటేశ్వర బధిరుల జూనియర్ కళాశాలను (2008 నుండి) టిటిడి నిర్వహిస్తోంది. విద్యతో పాటు డ్రాయింగ్, టైలరింగ్, బుక్ బైండింగ్ , యోగ లాంటి నైపుణ్య వృత్తులలో శిక్షణ ఇస్తోంది.
ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 231 మంది బధిర విద్యార్థిని, విద్యార్థులు, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 162 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1985 ఏడాది నుండి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 1987 ఏడాది నుండి బధిర విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించారు. ప్రస్తుతం భీమవరంలో 80 మంది, వరంగల్ లో 166 మంది బధిర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. టిటిడి ప్రతి ఏడాది బధిర విద్యార్థిని విద్యార్థుల పురోగతి కోసం సుమారు రూ.3.50 కోట్లు పైచిలుకు ఖర్చు చేస్తోంది. ఏడాదికోసారి తిరుపతి, తిరుమల ఆలయాలకు తీసుకెళ్తారు. టిటిడి బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల కళాశాల యందు విద్యను అభ్యసించిన విద్యార్థిని, విద్యార్థులు టిటిడిలో పలు విభాగాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.
ఈ సంస్థల ద్వారా బధిర విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, వైద్య సంరక్షణ, సంకేత భాష ఆధారిత బోధన, నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా పద్ధతులు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులను స్వావలంబన దిశగా తీర్చిదిద్దుతూ సమాజంలో సమాన అవకాశాలు కల్పించడమే ఈ సంస్థల లక్ష్యం. బధిర విద్యార్థులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తున్న ఈ విద్యా సంస్థలు టిటిడి సేవా సంకల్పానికి స్ఫష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి
The post బ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అమ‌రావ‌తి : త‌మ‌ది స్నేహ పూర్వ‌క‌మైన ప్ర‌భుత్వ‌మ‌ని , ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నామ‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా : దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌త దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా త‌మ‌కు సుంకాలు చెల్లిస్తుంద‌ని, కానీ తాము వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. శ‌నివారం ట్రంప్ మీడియాతో

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖకేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ