hyderabadupdates.com Gallery రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ :  సీఎం post thumbnail image

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం విజ‌య‌న‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ అనేది ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని సూచించారు. లేక పోతే తీవ్ర ఇబ్బందులు ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు సీఎం. ఇదిలా ఉండ‌గా చీపురుపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు. అక్క‌డి నుంచి నేరుగా చీపురుప‌ల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు చంద్ర‌బాబు నాయుడు. అక్క‌డే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో విద్యార్థినులతో ముచ్చటించారు.
వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు వివరించి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు సీఎం. సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశారు ఏఎన్ఎమ్‌లు. హెచ్‌పీవీ వల్ల ఉపయోగాల గురించి విద్యార్థినులకు తెలియ చేశారు సీఎం చంద్రబాబు. క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని చెప్పారు . సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా ఉంచాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీని కూడా నియమించాలని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీPM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ

భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ   భూటాన్‌ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్‌ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్‌ పర్యటన రెండో రోజు

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

      పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ

దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?

శ్రీ‌లంక : అస‌లైన పోరాటానికి వేదిక కానుంది శ్రీ‌లంక దేశ రాజ‌ధాని కొలంబో న‌గ‌రం. ఇప్ప‌టికే కోట్లాది మంది దాయాదుల మ‌ధ్య జ‌రిగే కీల‌క‌మైన మ్యాచ్ కోసం ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. త‌ట‌స్థ వేదిక‌గా దుబాయ్ లో జ‌రిగిన మ్యాచ్ లో