hyderabadupdates.com movies విడుదలకు ముందే నేషనల్ అవార్డుపై చర్చ

విడుదలకు ముందే నేషనల్ అవార్డుపై చర్చ

తమ సినిమా గొప్పదనం గురించి.. అలాగే ఆర్టిస్టుల నటన గురించి విడుదలకు ముందు మాట్లాడుతూ.. అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. తమ సినిమాకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని చిత్ర బృందాలు హైప్ ఇచ్చుకోవడం మామూలే. ఐతే ఒక చిత్ర బృందం కాకుండా బయటి వాళ్లు దాని గురించి ఇలా మాట్లాడుకోవడం అరుదే. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రష్మిక మందన్నా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి చర్చే జరుగుతోంది.

దర్శకుడిగా తన తొలి చిత్రం ‘చి ల సౌ’తో నేషనల్ అవార్డు సాధించిన రాహుల్ రవీంద్రన్.. మరోసారి అలాంటి మంచి సినిమానే తీశాడంటున్నారు. ‘మన్మథుడు-2’ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాహుల్.. ఈసారి పూర్తిగా తన పంథాలోనే ‘ది గర్ల్ ఫ్రెండ్’ తీశాడు. 

ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మోడర్న్ రిలేషన్‌షిప్స్ మీద కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుని.. హృద్యంగా ఈ సినిమాను రూపొందించినట్లున్నాడు రాహుల్. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు చిత్ర బృందం సినిమాను చూపించిందట. చూసిన వాళ్లందరూ గొప్ప సినిమా అని కొనియాడినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయట. విడుదల తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్ చర్చనీయాంశం అవుతుందని అంటున్నారు. 

అలాగే రష్మిక పెర్ఫామెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని.. సినిమాతో పాటు ఆమెకూ జాతీయ పురస్కారం దక్కే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ నడుస్తోంది. రష్మికకు జోడీగా నటించిన దీక్షిత్ శెట్టి పెర్ఫామెన్స్ సైతం వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఐతే ఇదంతా సినిమాకు హైప్ తీసుకురావడానికి జరుగుతున్న డిస్కషనా.. లేక నిజంగానే సినిమాలో అంత కంటెంట్ ఉందా అన్నదీ చూడాలి. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Post

6 ఫ్లాపుల తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్6 ఫ్లాపుల తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్

సప్తసాగరాలు దాటి సైడ్ ఎబి కన్నడలో పెద్ద విజయం సాధించింది కానీ తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో ఆశించిన స్పందన దక్కించుకోలేదు. అయితే హీరోయిన్ రుక్మిణి వసంత్ మనసులు గెల్చుకుంది, మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా

ఏపీలో గూగుల్ AI హబ్: ఊహించని పెట్టుబడిఏపీలో గూగుల్ AI హబ్: ఊహించని పెట్టుబడి

భారతదేశంలో టెక్నాలజీ రంగానికి ఊపునిచ్చే అతిపెద్ద ప్రకటన ఇది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఏకంగా $15 బిలియన్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపిన గూగుల్,

Mirage OTT Release: When and where to watch Asif Ali, Aparna Balamurali’s crime thriller onlineMirage OTT Release: When and where to watch Asif Ali, Aparna Balamurali’s crime thriller online

Mirage is a crime thriller that follows Abhirami, a young woman thrown into turmoil when her fiancé, Kiran, mysteriously disappears. Before vanishing, Kiran had been involved with a financial consultancy