hyderabadupdates.com movies విష్ణుప్రియ అయిపోయింది… ఇక అనన్య

విష్ణుప్రియ అయిపోయింది… ఇక అనన్య

ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ అన్న అమ్మాయిలు.. పెయిడ్ సబ్‌స్క్రిప్సన్లు పెట్టి ఆ యూజర్లకు ఎక్స్‌క్లూజిక్ హాట్ కంటెంట్ ఇవ్వడం ద్వారా లక్షలు సంపాదించడం ఇప్పుడు ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. సినీ, టీవీ రంగానికి చెందిన మహిళలు ఒక్కొక్కరుగా ఇందులోకి అడుగు పెడుతున్నారు.

ఇది కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారమే అయినా.. ఇందులో ఇల్లీగల్ ఏమీ లేకపోయినా.. ‘బిగ్ బాస్’ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిని ఈ మధ్య కొందరు అదేపనిగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.యువత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ విష్ణుప్రియ లక్షలు సంపాదిస్తోందని.. ఆమెపై చర్యలు చేపట్టాలని.. తన అకౌంట్ బ్లాక్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు దీని గురించి చర్చ జరిగింది.

ఐతే ఈ వ్యవహారంలో పోలీసులు చేసేదేమీ లేదన్నది స్పష్టం. ఈ కేసు, సోషల్ మీడియా ట్రయల్ పుణ్యమా అని విష్ణుప్రియకు ఒక్కసారిగా పెయిడ్ ఫాలోవర్లు మూడింతలు కావడం విశేషం. నెలకు ఏడెనిమిది లక్షలున్న ఆదాయం కాస్తా.. రూ.20 లక్షలకు చేరుకుంది.

ఐతే విష్ణుప్రియను ఏమీ చేయలేకపోయినా సోషల్ మీడియా జనాలు.. ఇప్పుడు ఇంకో తెలుగమ్మాయిపై పడ్డారు. మల్లేశం, వకీల్ సాబ్, పొట్టేల్ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించిన అనన్య నాగళ్ళ కూడా తన సోషల్ మీడియా అకౌంటును పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లోకి మార్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకు ఇప్పటికే 600 మంది దాకా ఫాలోవర్లు ఉన్నారు.

దీంతో ఒక్కో సబ్‌స్క్రిప్షన్ మీద రూ.399 చొప్పున ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో లెక్కలు వేస్తున్నారు నెటిజన్లు. దీని గురించి సోషల్ మీడియా చర్చలు, విమర్శలు ఊపందుకున్నాయంటే ఆటోమేటిగ్గా అనన్యకు కూడా ఫాలోవర్లు పెరగడం ఖాయం. అనన్య కూడా ఈ మధ్య పర భాషా కథానాయికలకు దీటుగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఫాలోవర్లు పెరిగే కొద్దీ.. సినిమాల సంగతెలా ఉన్నా ఈ సబ్‌స్క్రిప్షన్లతోనే మంచి ఆదాయం సంపాదించడానికి అవకాశముంది.

Related Post

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ఇప్పటి సందర్భాలకు కూడా ఇది సరిగ్గా వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 17 అలియా భట్ నటించిన బాలీవుడ్ మొదటి

SSMB29: When and where to watch Mahesh Babu starrer’s Globetrotter event onlineSSMB29: When and where to watch Mahesh Babu starrer’s Globetrotter event online

Earlier this week, Mahesh Babu and SS Rajamouli lit up the internet with their playful banter on social media. In a recent series of tweets, the superstar confirmed Priyanka Chopra