hyderabadupdates.com movies వెండితెర ‘మైఖేల్’ గెలిచాడా లేదా

వెండితెర ‘మైఖేల్’ గెలిచాడా లేదా

విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరోస్, విచిత్ర జంతువులు ఇవేవీ లేకుండా ఒక హాలీవుడ్ మూవీకి ఇండియాలో బజ్ రావడం ఒక్క మైఖేల్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. సోషల్ మీడియాని గమనిస్తే ఈ సినిమా మీద ఎంత బజ్ ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సినీ ప్రియులు ప్రీమియర్లను దాదాపు హౌస్ ఫుల్ చేసేశారు. తెలుగు డబ్బింగ్ లేకుండా సింగల్ లాంగ్వేజ్ లో వచ్చిన ఇంగ్లీష్ చిత్రానికి ఈ స్థాయి స్పందన ట్రేడ్ ముందుగా అయితే ఊహించలేదు.

తీరా చూస్తే మైఖేల్ యునానిమస్ అనిపించుకోలేకపోయింది. డాన్సింగ్ ఐకాన్ జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించలేదని, 2028లో విడుదల కాబోయే రెండో భాగం కోసం ముఖ్యమైన ఘట్టాలను దాచి పెట్టారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. తండ్రి కఠిన మనస్తత్వాన్ని భరించలేక ఆయన బ్యాండ్ నుంచి బయటికి వచ్చిన మైఖేల్ పెద్ద స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ మీద దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ బయోపిక్ రూపొందించారు. ఎంజె మేనల్లుడు జాఫర్ జాక్సన్ జీవించేశాడు.

మైఖేల్ విషయంలో ప్రధానంగా వినిపించిన కంప్లయింట్ ఆయన జీవితంలోని చీకటి కోణాలు, వివాదాలను టచ్ చేయకపోవడమే. చాలా సేఫ్ గా, కేవలం పాజిటివ్ అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం క్రిటిక్స్ కి నచ్చలేదు. ఎమోషన్స్ ని సరిగా పండించలేకపోవడంతో సినిమాలో అధిక భాగం డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వీరాభిమానులకు ఓకే కానీ కామన్ ఆడియన్స్ పెదవి విరిచే అవకాశాలు ఎక్కువగా ఇచ్చాడు మైఖేల్.

ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే మైఖేల్ ప్రభావం మల్టీప్లెక్సుల్లోనే కనిపిస్తోంది. ఒకవేళ తెలుగు డబ్ చేసి ఉంటే సింగల్ స్క్రీన్లకు ఫీడింగ్ దొరికేదేమో కానీ సోల్ పోకూడదన్న ఉద్దేశంతో నిర్మాతలు ఒరిజినల్ వెర్షన్ కు కట్టుబడటం ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితం లోతులోకి వెళ్ళకపోవడం ప్రతికూలంగా పని చేసింది. మనం మహానటిలో సావిత్రి గారి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించినట్టుగా మైఖేల్ లైఫ్ ని సదరు మేకర్స్ ఆవిష్కరించలేకపోయారు.

Related Post

EXCLUSIVE: After King, Shah Rukh Khan eyes a big-budget romantic drama as his nextEXCLUSIVE: After King, Shah Rukh Khan eyes a big-budget romantic drama as his next

As Shah Rukh Khan inches closer to wrapping up the shoot of King, the superstar has quietly begun meeting several writers and directors to lock his next feature film. Pinkvilla had earlier

మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు తేలిక అయ్యాయి. ఏపీలో ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ఏడాది కిందట్నుంచి ఇబ్బందులు తప్పట్లేదు. ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో జరిగిన

Chiranjeevi Honors Young Cricketer Tilak Varma for Asia Cup TriumphChiranjeevi Honors Young Cricketer Tilak Varma for Asia Cup Triumph

Megastar Chiranjeevi took a special moment on the sets of his upcoming family entertainer Mana Shankara Vara Prasad Garu to felicitate India’s young cricket star Tilak Varma for his outstanding