hyderabadupdates.com Gallery వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం

వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం

వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం post thumbnail image

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు . ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామ లక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రామ‌స్వామి తెప్పోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయ‌డం ప‌ట్ల సుదూర ప్రాంతాల నుండి తండోప తండాలుగా వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు టీటీడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రో వైపు ఒంటిమిట్ట‌లో శ్రీ కోదండ రామ‌స్వామి వార్షిక బ్రహ్మోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి.
రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishor: స్వరాష్ట్రంలో చతికిలపడిన చాణక్యుడు ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: స్వరాష్ట్రంలో చతికిలపడిన చాణక్యుడు ప్రశాంత్‌ కిశోర్‌

      ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్‌ కిశోర్‌… సొంత రాష్ట్రమైన బిహార్‌ లో మాత్రం చతికిల పడ్డారు. పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభావాన్ని చవిచూశారు. ‘చాయ్‌

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయంటీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

    పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర