hyderabadupdates.com movies వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?

వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?

14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా, టీమ్ ఇండియాకు ఒక పవర్‌ఫుల్ వెపన్‌లా మారిపోయాడు. వైభవ్ వస్తున్నాడంటే అది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే కాదు, అతని కన్సిస్టెన్సీ చూస్తుంటే సీనియర్ టీ20 టీమ్‌లోకి ఎంట్రీ చాలా దగ్గరలోనే ఉందనిపిస్తోంది.

వైభవ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అండర్ 19 ఆసియా కప్‌లో మెరుపులు, తాజాగా సౌతాఫ్రికాపై కేవలం 74 బంతుల్లోనే 127 రన్స్.. ఇవన్నీ ఒకెత్తయితే, విజయ్ హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ మరో ఎత్తు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఇతన్ని కోటి పది లక్షలతో కొనేసింది. పవర్‌ప్లేలో బంతిని బాదడంలో ఇతని రేంజ్ వేరే లెవల్‌లో ఉంది.

వైభవ్ గనుక టీమ్ లోకి వస్తే ఎవరి ప్లేస్ గల్లంతవుతుంది? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. విశ్లేషకుల అంచనా ప్రకారం, సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశం ఉంది. టీమ్ బ్యాలెన్స్ కోసం వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూను పక్కన పెట్టి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఇది సంజూ టాలెంట్ మీద కాకుండా, టీమ్ కాన్ఫిగరేషన్ కోసం తీసుకునే నిర్ణయం అయ్యేలా ఉంది.

ఒకవేళ సంజూ తప్పుకుంటే, ఇషాన్ కిషన్ ప్రైమరీ వికెట్ కీపర్‌గా మారుతాడు. ఇషాన్ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వస్తే, ఓపెనింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ ఇంపాక్ట్ చూపించవచ్చు. ఫస్ట్ ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పేసుకోవాలనేది బీసీసీఐ మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తోంది. దీనివల్ల మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.

దీనివల్ల శుభ్‌మన్ గిల్ పరిస్థితి కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది. గిల్ స్ట్రైక్ రేట్ కంటే వైభవ్ అగ్రెషన్ ఎక్కువగా ఉండటంతో గిల్ బ్యాకప్ ప్లేయర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అటు శివమ్ దూబే ప్లేస్ లో కూడా మార్పులు రావచ్చు. వైభవ్ లాంటి హిట్టర్ పవర్‌ప్లేలోనే విధ్వంసం సృష్టిస్తే, చివరి ఓవర్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరి ఈ సంచలన మార్పులు 2026 వరల్డ్ కప్ లోపు జరుగుతాయో లేదో వేచి చూడాలి.

Related Post

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు. ఆ పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ

Chiranjeevi Ready to Rule the Sankranthi Box Office – Industry TalkChiranjeevi Ready to Rule the Sankranthi Box Office – Industry Talk

This Sankranthi season is turning into an exciting box office battle. Industry circles are closely watching Chiranjeevi’s upcoming film MSVPG  (Mana Sankara Vara Prasad Garu), which is expected to make