hyderabadupdates.com movies వైసీపీ టాక్‌: ఇక‌ స‌ర్వం స‌జ్జ‌లే!

వైసీపీ టాక్‌: ఇక‌ స‌ర్వం స‌జ్జ‌లే!

వైసీపీలో మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి శ‌కం ప్రారంభం అవుతుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. శనివారం స‌తీ స‌మేతంగా యూర‌ప్(బ్రిట‌న్ స‌హా.. ఇత‌ర దేశాలు) ప‌ర్యట‌నకు వెళ్లారు. వ‌చ్చే మే 15వ తేదీ వ‌ర‌కు ఆయ‌న విదేశాల్లో ఉండ‌నున్నారు. దీనికి సంబంధించి హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టు ష‌ర‌తులతో కూడిన అనుమ‌తి కూడా ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌గన్‌.. అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ అయ్యారు. ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేక‌మ‌య్యారు. అనంత‌రం.. శుక్ర‌వారం ఆయ‌న బెంగ‌ళూరుకువెళ్లి.. అక్క‌డి నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌నకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను మ‌ళ్లీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికే అప్ప‌గించార‌ని చెబుతున్నారు.

గ‌తంలోనే వివాదం..

గ‌తంలో కూడా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. పార్టీ బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌ల‌కు అప్ప‌గించారు. ఆ స‌మయంలోనే పార్టీలో అనేక వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. నాయ‌కుల‌కు స‌రైన గైడెన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు స‌మ‌యానికి స‌రిగ స్పందించ‌లేద‌ని నాయ‌కులు స‌జ్జ‌ల‌పై ఫిర్యాదులు చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత కొన్ని రోజులు స‌జ్జ‌ల ప్ర‌మేయం త‌గ్గినా.. ఇప్పుడు మ‌రోసారి పార్టీ బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌లకు అప్ప‌గించ‌డంపై పార్టీలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

కీల‌క స‌మ‌యంలో..

ప్ర‌స్తుతం పార్టీకి కీల‌క స‌మ‌యం న‌డుస్తోంది. విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు, రైతులకు విత్త‌నాలు.. మ‌రోవైపు ఉత్ప‌త్తుల కొనుగోలు, ధాన్యం విక్ర‌యాలు వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌లోకి వెళ్లాల‌ని జ‌గ‌న్ ఇటీవ‌లే దిశానిర్దేశం చేశారు. కానీ.. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న రాష్ట్రం వ‌దిలి విదేశాల‌కు వెళ్తున్నారు. ఇలాంటి కీల‌క‌స‌మ‌యంలో స‌జ్జ‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల్లోనే పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. 

Related Post

రన్ టైమ్ పుకార్లకు రెక్కలు వస్తున్నాయ్రన్ టైమ్ పుకార్లకు రెక్కలు వస్తున్నాయ్

ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి

టైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవితటైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవిత

తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కవిత