దుబాయ్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ప్రతి నెలా క్రికెట్ కు సంబంధించి అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేస్తుంది. ఈసారి మార్చి నెలకు సంబంధించి ఐసీసీ బెస్ట్ ప్లేయర్ అవార్డును ప్రకటించింది. ఇందులో భాగంగా కేరళ క్రికెట్ స్టార్ సంజు శాంసన్ ను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక చేసింది. ఈ సందర్బంగా క్రికెట్ అభిమానులు , విశ్లేషకులు అభినందించారు. ఇండియన్ ఓపెనర్ గా సత్తా చాటాడు. ఈ ఏడాది ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడాడు. కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన శాంసన్ 321 రన్స్ చేశాడు. సగటు 200 స్ట్రైక్ రేట్ తో. దీంతో భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. తను ఆడక పోయి ఉండి ఉంటే ఇండియా కప్ గెలిచి ఉండేది కాదు. కీలకమైన విండీస్ తో 97 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.. ఇండియాను గట్టెక్కించాడు. ఆపై సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో 89 రన్స్ చేశాడు.
కీలకమైన పాత్ర పోషించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో 89 పరుగులు చేసి విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు సంజు శాంసన్. ఇక గత ఐదు నెలలుగా దక్షిణాఫ్రికాకు చెందిన సైమన్ హార్మర్, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ , పాకిస్తాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్‌తో సహా వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్బంగా సంజు శాంసన్ స్పందించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచు కోవడం ఒక అద్భుతమైన అనుభూతి, ప్రత్యేకించి నా క్రికెట్ ప్రయాణంలో అత్యంత మరపురాని దశలో ఇది లభించడం మరింత ఆనందాన్నిస్తోందని అన్నాడు. పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయంలో భాగం కావడం మరిచి పోలేనని పేర్కొన్నాడు.
The post సంజు శాంసన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సంజు శాంసన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
Categories: