hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్

సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్

సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్ post thumbnail image

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న‌కు క్రికెట్ అంటే ఇష్టం. అంత‌కు మించి త‌మ రాష్ట్రానికి చెందిన‌, తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తిరువ‌నంత‌పురం కుర్రాడు సంజు శాంస‌న్ అంటే ఎన‌లేని ప్రేమ‌. తాజాగా ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో శాంస‌న్ స‌త్తా చాటాడు. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్ప‌టికే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను వంటి చేత్తో గెలిపించాడు. ఈ త‌రుణంలో టోర్నీలో ఇది వ‌రుస‌గా రెండో సెంచ‌రీ కావ‌డం విశేషం. ముంబైలో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో త‌ను 101 ర‌న్స్ చేసి అజేయంగా నిలిచాడు. కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో హోరెత్తించాడు.
ఈ సంద‌ర్బంగా ఎంపీ శ‌శి థ‌రూర్ స్పందించాడు. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు శాంస‌న్ గురించి. సంజులో ఏదో ఉంది, గాలిలో ఒక సొగసు, మణికట్టు కదలికతో, నిబ్బరమైన చూపుతో. టైమింగ్ సరిగ్గా కుదిరి బంతి వికెట్‌ను తాకినప్పుడు, మనమందరం చేయాలని కోరుకునే పనులను అతను చేస్తున్నాడని పేర్కొన్నాడు. జైపూర్ ప్రకాశవంతమైన వెలుగుల నుండి వాంఖేడే ఎండ వరకు, అతను ఒత్తిడిని పెంచి, ఆపై పరుగు లంకిస్తాడు. అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం. “చెపాక్” అయినా, “డర్బన్” అయినా, అతను ఆ నేలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. బలవంతంగా బాదడం గానీ, కష్టపడటం గానీ లేదు, కేవలం సునాయాసమైన గమనంతో, స్వచ్ఛమైన కాంతి రేఖలతో చిత్రించిన వంద పరుగులు. ఆ మైలురాయిని చేరుకోవడానికి ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చినా ,సంజు సాధించే అద్భుతానికి సాటి మరొకటి లేదని పేర్కొన్నాడు శ‌శి థ‌రూర్.
The post సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదంపెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు

విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మరియు ‘బ్యూటీ’ వంటి సినిమాలు విజయవంతంగా రీల్‌లో వచ్చాయి. విభిన్న కథలతో సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా Vijay Pal Reddy అడుగుపెట్టారు. ఇప్పుడెన్నో విజయాల తర్వాత, ఆయన మరోసారి

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్

DGP Shivadhar Reddy : నిజామాబాద్‌ లో కానిస్టేబుల్‌ను హతమార్చిన (Conistable Death) వాహనాల దొంగ రియాజ్‌ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌… కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం