hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం

సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం

సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం post thumbnail image

హైద‌రాబాద్ : అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్. దేశీవాళి క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కానీ అస‌లైన మ్యాచ్ ల‌లో ఆడ‌కుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింది. త‌ను భార‌త దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వహించేందుకు . లెక్క‌లేనంత మంది ఫ్యాన్స్ ఉన్న ఈ బ్యాట‌ర్ క‌మ్ వికెట్ కీప‌ర్ ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. త‌న‌పై ఎలాంటి ప్రెష‌ర్ లేదు. అలాగ‌ని ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేయాల‌ని టార్గెట్ విధించ‌లేదు జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ లు. కానీ బంగారం లాంటి అవ‌కాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు స్వ‌యంగా సంజూ శాంస‌న్. రాబోయే రోజుల్లో త‌న ఫ్యూచ‌ర్ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.
గ‌తంలో ఇప్పుడున్నంత పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మెరిక‌ల్లాంటి యువ ఆట‌గాళ్లు దూసుకు వ‌స్తున్నారు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఒక్కో ప్లేయ‌ర్ స్థానం కోసం ఏకంగా ప‌ది మందికి పైగా పోటీ ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో సంజూ శాంస‌న్ జాగ్ర‌త్త‌గా ఆడాల్సి ఉంది. కానీ స్వ‌దేశంలో ఫ్యాన్స్ మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉండే చోట త‌నంత‌కు తానుగా తేలి పోయాడు. చెత్త షాట్స్ కోసం వెళ్లి వికెట్ల‌ను పారేసుకున్నాడు. ప‌రుగులు చేయ‌లేక పోయాడు. ఇతడు సంజూ శాంస‌న్ అనేలా , అనుమానం వ‌చ్చేలా ఆడాడు. నిన్న‌టి దాకా పొగిడిన అభిమానులంతా ఇప్పుడు త‌న‌ను విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. ఓ వైపు కొంత కాలం గ్యాప్ త‌ర్వాత , ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఇషాన్ కిష‌న్ త‌న హోం గ్రౌండ్ లో సెంచ‌రీ చేస్తుంటే త‌ను మాత్రం బేల‌గా పెవిలియ‌న్ లో కూర్చున్నాడు. ఆట యుద్దం లాంటిది..చంప‌డమో చావ‌డ‌మో మాత్ర‌మే ఉంటుంది. ఇక‌నైనా మేలుకొంటే బెట‌ర్ లేక పోతే చాప్ట‌ర్ క్లోజ్.
The post సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

    బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను

ముస్తాఫిజుర్ రెహ‌మాన్ కు కేకేఆర్ భారీ షాక్ముస్తాఫిజుర్ రెహ‌మాన్ కు కేకేఆర్ భారీ షాక్

కోల్ క‌తా : బంగ్లాదేశ్ క్రికెట‌ర్ ముస్తాఫిజుర్ రెహ‌మాన్ సంచ‌ల‌నంగా మారాడు. త‌న‌ను ఐపీఎల్ వేలం పాట‌లో భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది కేకేఆర్ యాజ‌మాన్యం. తాజాగా భార‌త్, బంగ్లాదేశ్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల న‌డుమ సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి కీల‌క కామెంట్స్రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి కీల‌క కామెంట్స్

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సురక్షిత ఓట‌రు న‌మోదుకు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్నికల అధికారులు అనుసరించే ఆచరణాత్మక విధానాలను వివరించారు, ఆన్‌లైన్ ఓటరు-లుకప్ సేవలు, నియంత్రిత-యాక్సెస్ కియోస్క్‌లు ,