hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం post thumbnail image

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్ అనంత‌రం మీడియాతో మాట్లాడాడు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని మ్యాచ్ ఇది అని పేర్కొన్నాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో త‌మ అంచ‌నాల‌కు మించి ఆడాడంటూ సంజూ శాంస‌న్ గురించి పేర్కొన్నాడు. త‌ను చివ‌రి దాకా నిలవ‌డ‌మే కాదు కీల‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని, కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాడ‌ని ప్ర‌శ‌సంలు కురిపించారు సూర్య కుమార్ యాద‌వ్.
ఒక ర‌కంగా చెప్పాలంటే సంజూ శాంస‌న్ గ‌నుక మైదానంలో లేక పోయి ఉంటే భార‌త జ‌ట్టు సెమీస్ కు చేరుకుని ఉండేది కాద‌న్నాడు. క‌ళాత్మ‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. పూర్తిగా పాత స్టైల్ క్లాసిక్ బ్యాటింగ్ తో మ‌న‌సు దోచుకున్నాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్. ఇదే క్ర‌మంలో కామెంటేట‌ర్ బాక్స్ లో ఉన్న మాజీ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. యాభై పూర్తి చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోకు, సిక్స్ కొట్టడానికి తొందరపడి బయటకు వెళ్లకు. మళ్ళీ గార్డ్ ఫ్రెష్ గార్డ్ తీసుకొని, కొత్త లైన్లు గీయడం, మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం, మళ్ళీ అతను పిచ్ అర్థం చేసుకున్నట్లుగా రెండు బంతుల డిఫెన్స్ ఆడాడు.. అంటే అతను భారతదేశం గెలిపించే వరకు తన విధి పూర్తి కాదని అతనికి తెలుసు అని పేర్కొన్నాడు.
The post సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

BJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తుBJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

  త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమిలో భాగంగా 140 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ

దిగ్గ‌జ గాయ‌ని ఆశా భోస్లే క‌న్నుమూతదిగ్గ‌జ గాయ‌ని ఆశా భోస్లే క‌న్నుమూత

ముంబై : భార‌తీయ సినీ వినీలాకాశంలో విషాదం చోటు చేసుకుంది. త‌న గాన మాధుర్యంతో కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ సోద‌రి ఆశా భోస్లే ఆదివారం ముంబైలో క‌న్నుమూశారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో

సంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధంసంజూ శాంస‌న్ స్వ‌యంకృతాప‌రాధం

హైద‌రాబాద్ : అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్. దేశీవాళి క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కానీ అస‌లైన మ్యాచ్ ల‌లో ఆడ‌కుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింది. త‌ను భార‌త