hyderabadupdates.com Gallery విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – 2026 నివేదిక బ‌క్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మూడు రోజుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం‌కు విద్యా విధానంపై నివేదిక ఇచ్చారని అన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్ఎస్పీ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగిందన్నారు. ఆకునూరి ముర‌ళి కావాల‌ని సీఎం చెప్పిన‌ట్టు నివేదిక త‌యారు చేశార‌ని, లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ వాపోయారు.
ఉపాధ్యాయుల జీతాలను విద్యా కమిషన్ కాదు, పీఆర్‌సీ నిర్ణయించాల్సి ఉంటుంద‌న్నారు. ఆ మాత్రం విష‌యం తెలుసుకోకుండా నివేదిక ఇవ్వ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఆర్ఎస్పీ. ఒళ్లంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్టును తయారు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని మురళి ఎలా అంటారని ప్ర‌శ్నించారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్‌లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారంటూ వాపోయారు. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్టుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.
The post విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానంజ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి

CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు ఆయన్ని మొహాలి ఆఫీస్‌లో అదుపులోకి తీసుకున్నారు.