hyderabadupdates.com movies సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే రీ రిలీజులు తప్ప కొత్త సినిమాలు ఆడని దారుణమైన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద నెలకొంది. స్టార్ హీరోలు రాకపోవడం, చిన్న సినిమాలు హడావిడి తప్ప అసలు విషయంలో చేతులు ఎత్తేయడం లాంటి కారణాలు ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయేలా చేస్తున్నాయి. అంత బలహీనమైన వేసవిని ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గాయపడ్డ సింహం మీద పెద్ద బరువే ఉంది. నిన్న హైదరాబాద్ లో దుల్కర్ సల్మాన్ గెస్టుగా ట్రైలర్ లాంచ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చూపించారు. కూతురిని అమెరికా అల్లుడికే ఇచ్చిన చేయాలని కంకణం కట్టుకున్న బిగ్ షాట్, యుఎస్ మోజులో పడి అక్కడ ఉద్యోగం కోసం నానా తిప్పలు పడే ఒక యువకుడు, డబ్బులు ఇస్తే చాలు మంచి చెడు రెండూ చేసే ఒక లోకల్ డాన్, వీళ్ళతో పాటు అదనంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలు. ఇలా సెటప్ ని నీట్ గా పరిచయం చేశారు.

తరుణ్ భాస్కర్ హీరో అయినప్పటికీ ఇందులో అన్ని క్యారెక్టర్లకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన వైనం కనిపిస్తోంది. జెడి చక్రవర్తి చెప్పిన ప్రకారం చూస్తే ఇది మనీ, అనగనగా ఒక రోజు రేంజ్ లో పేలాలి. అసలే అలాంటి కామెడీలు మిస్ అయిపోయి జనాలు మొహం వాచిపోయి ఉన్నారు. ఈ టైంలో గాయపడ్డ సింహం ఊరట కలిగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీకి పోటీగా వస్తున్న కమెడియన్ సత్య జెట్లీది కూడా ఇదే జానరే.

గాయపడ్డ సింహం ఇంకో తెలివైన పని చేసింది. స్పెషల్ క్యామియో చేసిన శ్రీవిష్ణుని దాచి పెట్టకుండా చూపించేశారు. ఇలాంటి ఎలిమెంట్స్ మాములుగా సర్ప్రైజ్ రూపంలో హైడ్ చేస్తారు కానీ ఆడియన్స్ ని వేగంగా ఆకట్టుకోవడానికి టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది. ఓం శాంతి శాంతి శాంతితో ఫెయిల్యూర్ చూసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడీ గాయపడ్డ సింహం మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కు స్వీకర్ ఆగస్తి సంగీతం సమకూర్చారు.

Related Post

‘Gabby’s Dollhouse: The Movie’ Ending: How That Surprise Reveal Opens Up the Franchise‘Gabby’s Dollhouse: The Movie’ Ending: How That Surprise Reveal Opens Up the Franchise

DreamWorks Animation’s adaptation of Netflix’s hit preschool series dropped a new fact about Gabby to end the big-screen adventure — star Laila Lockhart Kraner, director Ryan Crego and producer Steven