hyderabadupdates.com movies సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డికి ఈరోజు నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నిజమని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ బృందం తేల్చింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అని 2024 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాం నాటి టిటిడి చైర్మన్లు గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూపించాయి.

ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టీ చంద్రబాబు గారు టీటీడీ ప్రతిష్ట మంట గలుపుతున్నారు అని అటువంటి కల్తీ కి ఆస్కారం లేదు అని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని.. ఆయన ” సూపర్ స్వామి” అని తన చిన్నాన్నను సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడం వైసీపీలో కలకలం రేగింది.

Related Post

సీఎం స్వయంగా పాడె మోశారుసీఎం స్వయంగా పాడె మోశారు

ప్ర‌ముఖ కవి, తెలంగాణ ఉద్యమ గళం అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి దశ వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ, అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా సీఎం

6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan

Cast: Vinod Sharma, Sahil Vaid, Saumya Daan, Annamaya Verma Creator: Anu Sikka Genre: Animated Mythological Epic Runtime: 9 Episodes Where to watch: Netflix Streaming date: October 10, 2025 Originally in