hyderabadupdates.com Gallery స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం post thumbnail image

విజ‌య‌వాడ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి ఆనాడు అక్ర‌మంగా బ‌నాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయింద‌న్నారు. స్కిల్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో న్యాయం, ధర్మం గెలిచినట్ల‌యింద‌న్నారు వాసం శెట్టి సుభాష్. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందన్నారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడలేవని ఈ తీర్పుతో వెల్ల‌డైంద‌న్నారు. ఏపీ స్కిల్ కేసుతో చంద్రబాబుకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొనడం కీలక పరిణామం అన్నారు వాసం శెట్టి సుభాష్.
రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసులన్నీ ఒక్కొక్కటిగా కూలి పోతున్నాయన్నారు . ఇప్పటికే ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు పాత్ర లేదని తేల్చడమే దానికి నిదర్శనం అన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు ఉపసంహరించు కోవడంతో గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేయ‌డం చెంప పెట్టు లాగా మారింద‌న్నారు వాసంశెట్టి సుభాష్‌. చంద్రబాబు నాయుడి నిజాయితీ, విజనరీ పాలన, పరిపాలనా దక్షతపై మరోసారి రుజువైందన్నారు. ముఖ్య‌మంత్రి నాయకత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కార్మిక శాఖ మంత్రి. గతంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏపీ రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా నిర్వీర్యం చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని, అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు వాసం శెట్టి సుభాష్‌.
The post స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

Tejashwi Yadav : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్‌) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేరు ఖరారైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ’ (వీఐపీ) అధినేత ముఖేశ్‌ సాహ్నీ పేరును

Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్

Ex MLC Kavitha : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కవిత (Ex

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల