hyderabadupdates.com Gallery స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం post thumbnail image

హైద‌రాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీక‌ర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేద‌ని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారులను స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పద‌ని హెచ్చ‌రించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును గ‌డ్డంప్ర‌సాద్ కుమార్ డిస్మిస్ చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న ఫిరాయింపుదారులు స్పీకర్ కి కనపడ కపోవడం విచారకరం అన్నారు. ఇంత‌కు త‌ను క‌ళ్లుండి క‌బోధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి.
స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతూనే మ‌రో వైపు తాను కాంగ్రెస్ పార్టీల చేర‌లేద‌ని చెప్ప‌డం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి స్పీక‌ర్ స‌రిగ్గా నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నాడ‌ని వాపోయారు. ఆద‌ర్శ ప్రాయంగా నిల‌వాల్సిన గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స్పీక‌ర్ ప‌ద‌వికి చేటు తీసుకు వ‌చ్చేలా చేశాడ‌ని మండిప‌డ్డారు జ‌గ‌దీశ్ రెడ్డి.
The post స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000