hyderabadupdates.com Gallery అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?

అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?

అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా? post thumbnail image

అమ‌రావ‌తి : బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్షకు పూనుకున్నానని అన్నారు. నేను అడుగుతున్న ఐదు డిమాండ్లలో నాలుగు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలేన‌ని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టం, జనాభా గణన, 44% రిజర్వేషన్లు ఇవన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీలేన‌ని తెలిపారు. బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు వారి వెన్నెముక విరిచే కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు కుటుంబానికో, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బినామీలకో చెందింది కాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరి ఆస్తి అని ప్ర‌క‌టించారు. లక్ష ఎకరాల రాజధానిలో ప్రభుత్వ అవసరాలు పోగా, ప్రైవేట్ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇస్తున్నారో, అదే ప్రాతిపదికన బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ భూమికి మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను, బీసీవై పార్టీ సిద్ధంగా ఉన్నాం అని ప్ర‌కటించారు. టీడీపీ అనుకూల మీడియాలో అమరావతిలో ఫామ్ హౌస్‌లు కట్టుకోవడానికి 7,000 మంది ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారని కథనాలు వస్తున్నాయన్నారు. నిజంగా అమరావతి ప్రజా రాజధానా? లేక ఫామ్ హౌస్‌లు, రేవ్ పార్టీల కోసమా? దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
The post అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలుDK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు

DK Shivakumar : కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి కొట్టివేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. నాయకుడి కోసం మీడియానో, పార్టీలోని వారో వెతకాల్సిన

న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగిందిన‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది

హైద‌రాబాద్ : 24 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి ప్ర‌త్యూష కేసుపై. మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌త్యూష కేసులో కీల‌క నిందితుడిగా ఉంటూ బెయిల్

కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

న్యూఢిల్లీ : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పులికాట్ సరస్సులో సుమారు 20 వేల మంది సంప్రదాయ మత్స్యకారులు గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రస్తావించారు. రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో