hyderabadupdates.com Gallery మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ post thumbnail image

వికారాబాద్ జిల్లా : భార‌త దేశానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ దిక్సూచిగా మారార‌ని కొనియాడారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం దక్కడం, నా అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు. సమానత్వం, న్యాయం, ఆత్మ గౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు మంత్రి.
ప్రపంచంలో జాతి వివక్ష, బానిసత్వం వంటి వివక్షలు ఉన్నప్పటికీ, మన దేశంలో అంటరానితనం అనే అమానవీయ వ్యవస్థ ఉండేదన్నారు. చతుర్వర్ణ వ్యవస్థ, కఠిన కుల వ్యవస్థ సమాజాన్ని తీవ్రంగా విభజించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ అన్యాయాలు, అసమానతలను గౌతమ బుద్ధుడు, బసవేశ్వరుడు వంటి సంస్కర్తలు సవాలు చేశారని గుర్తు చేశారు. వారు మానవత్వం, సేవ, ఆత్మశోధన వంటి విలువలను బోధించార‌ని అన్నారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. మహాత్మా జ్యోతిరావు ఫూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారా సమాజ మార్పును సాధించాలని నమ్మారని అన్నారు. మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించి మహిళా సాధికారతకు పునాది వేశారని ప్ర‌శంసించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొని, విద్యతో ఎదిగి భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిచార‌ని కొనియాడారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను దేశానికి అందించారని అన్నారు. విద్య, సంఘటితం, పోరాటం ద్వారా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. దళితుల మాత్రమే కాదు, పేదలు, వెనుకబడిన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మ‌హ‌నీయుడ‌ని పేర్కొన్నారు మంత్రి. బాబు జగ్జీవన్ రామ్ కూడా వివక్షను ఎదుర్కొని, దేశ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి, దళితుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశార‌ని చెప్పారు. ఈ మహనీయుల లక్ష్యం సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమే అని అన్నారు.
The post మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టంBihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

    బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా

హెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దుహెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజంలో రోజు రోజుకు హెచ్ ఐ వీ బాధితులు పెరిగి పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కానీ వారి ప‌ట్ల ప్రేమ పూర్వ‌కంగా ఉండాల‌ని

KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదుKTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు

KTR : కాంగ్రెస్‌ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సోమవారం బీఆర్కే భవన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్ (KTR).