hyderabadupdates.com Gallery ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. రాష్ట్రంలో ఎండ, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈనెల 22న బుధ‌వారం 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 51తీవ్ర, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండ‌గా శ్రీకాకుళం 19, విజయనగరం 21, మన్యం 3, అల్లూరి 4, పోలవరం 5, విశాఖ1, అనకాపల్లి 15, కాకినాడ 6, తూర్పుగోదావరి 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 44.4°C, ప్ర‌కాశం జిల్లా లోని కొప్పెర‌పాడులో 44.1°C, నెల్లూరు(జి) కొమ్మిపాడు, కాకినాడ(జి) కరపలో 43.6°C, కడపలో 43.5°C,అనంతపురం(జి) తెరన్నపల్లిలో 43.4°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 43.3°C, శ్రీసత్యసాయి(జి) తలుపుల, నంద్యాల(జి) సంజామలలో 43.2°C, పల్నాడు(జి) గురజాలలో 42.9°C, కర్నూలు(జి) తోవి, అన్నమయ్య(జి) నూలివీడులో 42.5°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 42.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు రేపు మన్యం, అల్లూరి, పోలవరం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశువుల‌ కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
The post ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై లుక్ అవుట్ నోటీస్లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై లుక్ అవుట్ నోటీస్

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ ను బెదిరించిన కేసులో గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిపై ఎల్ఓసీ జారీ అయ్యింది. బెదిరింపు ఆడియో క్లిప్ ను పంజాబ్ , హ‌ర్యానా పోలీసుల‌కు పంపించిన‌ట్లు పోలీసులు

BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదాBC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

    తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీపై స్టే

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాంవిద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – 2026 నివేదిక బ‌క్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్