hyderabadupdates.com Gallery ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్

ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్

తిరుపతి : ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం అమ‌లు చేయాల‌ని అన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో టిటిడి ఈవో సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం, ఖర్చులు ఎంత వస్తోంది, ఏ ఏ ఆలయాలకు బడ్జెట్ కు లోబడి ఖర్చులు అవుతున్నాయి, ఏఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాల రోజు వారి నిర్వహణ, మరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్పస్ ఫండ్ కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు. పెద్ద స్థాయిలో మరమ్మతులు, వార్షిక ఉత్సవాల కోసం కేపిటల్ ఖర్చుగా భావించి టిటిడి నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వచ్చే వేసవి నేపథ్యంలో టిటిడి ఆలయాలలో భక్తులకు వైద్యసేవలు, తాగునీరు, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టిటిడిలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, కార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, ఎప్ఏఅండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
The post ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్పీక‌ర్ ఎందుకింత తాత్సారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హంస్పీక‌ర్ ఎందుకింత తాత్సారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పందించింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే జారీ చేసిన ఆదేశాల‌కు గాను తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్

Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశంMinister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం

    ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు.

Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలిSupreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి

        విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ