hyderabadupdates.com Gallery ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ లేదు డిజిల్ లేదు అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు..రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు అని మండిప‌డ్డారు ష‌ర్మిలా రెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గు పడాలన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.
సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ .పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణం అన్నారు. ప్ర‌ధాని మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చో బెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరం అని పేర్కొన్నారు.
సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కొరత తీరదన్నారు. అమ్మకాలు, ఆందోళనల పేరుతో మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తే కుదరదు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలన్నారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ష‌ర్మిలా రెడ్డి.
The post ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తోంద‌న్నారు ఏపీ 20 సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు చైర్మ‌న్ లంకా దిన‌క‌ర్. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ 2026-2027 ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ

పెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యంపెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యం

ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశంలోని రెండు రాష్ట్రాల వైపు అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. త‌మిళ‌నాడులో 234 స్థానాల‌కు, ప‌శ్చిమ బెంగాల్ లో తొలి విడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యంసెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

చెన్నై : చెన్నై వేదిక‌గా గురువారం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు సమిష్టిగా రాణించింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిలో 72 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరుకునేందుకు