hyderabadupdates.com Gallery ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిజ‌మైన బ్రాండ్ అంబాసిడ‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి. అన‌కాప‌ల్లిలో జ‌రిగిన కంపెనీ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఈరోజు ఈ ప్రాజెక్టు ఇక్కడికి రావడానికి కారణం ఇన్సెంటివ్స్, భూమి, పాలసీలు కానే కాద‌న్నారు. ప్ర‌ధాన కార‌ణం చంద్ర‌బాబు అని అన్నారు. రాష్ట్రానికి నిజ‌మైన గుర్తింపు తీసుకు రావ‌డంలో ప్ర‌పంచంలోనే ఏపీని గుర్తు పెట్టుకునేలా చేయ‌డంలో సీఎం కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పారు.
సీబీఎన్ పేరు కానే కాద‌ని అది న‌మ్మ‌కానికి, విశ్వాసానికి, స‌మ‌ర్థ‌త‌కు, ప‌రిపానాల ప‌రంగా బ‌ల‌మైన ముద్ర అని చెప్పారు నారా లోకేష్ కొన్ని దశాబ్దాలపాటు ఆయన నిర్మించిన నమ్మకం. 2025 దావోస్ లో అదిత్య మిట్టల్ చెప్పాడు: ఇది గణాంకాల గురించి కాదు. సీబీఎన్ పైన, ఆయన నాయకత్వం పైన, స్థిరమైన అభివృద్ధి సాధనమైన నమ్మకం. అది సీబీఎన్ బ్రాండ్. దశాబ్దాలుగా క్రెడిబిలిటీ నిర్మించిన నాయకుడు. ప్రపంచ ఇన్వెస్టర్లు నమ్మే నేత. ఇది కేవలం హామీల వల్ల కాదు, సామర్థ్యం వల్లే సాధ్యం. నమ్మకంతో పాటు, అలైన్‌మెంట్, పార్ట్‌నర్‌షిప్ కూడా అత్యంత అవ‌స‌రం అని పేర్కొన్నారు నారా లోకేష్.
ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, సమర్ధ నాయకత్వంలో భారతదేశం ట్రాన్స్‌ఫర్మేషనల్ గ్రోత్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి బలమైన పాలసీ మద్దతునిస్తోంది అని అన్నారు. నాకు అసాధారణ సపోర్టు అందించిన కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.
The post ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులుRamachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Ramachandra Yadav : నక్కపల్లి బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాంసంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్