hyderabadupdates.com Gallery ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

ఏపీలో  విదేశీ నిపుణుల బృందం పర్యటన post thumbnail image

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. రెండో రోజు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 1 లో మట్టి పటిష్టత ఎలా ఉందో పరిశీలించారు. ఇప్పటికి మట్టిని గట్టి పరిచిన ప్రాంతంలో కొంత మేర తవ్వి అక్కడ గట్టి దనం ఎలా ఉందో లోపలకు దిగి పరిశీలించారు. మరో చోట బంక మట్టిని వేసి దానిని పటిష్ట పరిచే తీరును పరిశీలించారు. బంక మట్టి పరిచి రోలర్ తిప్పిన తరువాత ఎంత మేర గట్టి పడుతుందో చూశారు. అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
గ్యాప్ 2 ఆకృతులపై చర్చించారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్ లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని తదితరులు ఉన్నారు.
The post ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భార‌త్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly : యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ (Celina Jaitly) భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. ఆ పోస్టులో..

చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్దిచంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది

అమరావతి : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు దేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలు అవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్