hyderabadupdates.com Gallery క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ post thumbnail image

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుస‌రించిన తీరు పై స్పందించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి. లా అండ్ ఆర్డ‌ర్ బాగోలేద‌నే సాకుతో పీసీబీ నాట‌కాలు ఆడ‌టంపై మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా గంగూలీ మీడియాతో మాట్లాడారు . క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు పాకిస్తాన్ దేశ అధ్య‌క్షుడు సైతం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. మరో వైపు బంగ్లాదేశ్ జ‌ట్టు సైతం బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చివ‌ర‌కు ఐసీసీ దెబ్బ‌కు దిగి రాక త‌ప్ప‌లేదు. శ్రీ‌లంక వేదిక‌గా తమ‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తే ఆడుతామ‌ని ప్ర‌క‌టించారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మోహిసిన్ న‌ఖ్వీ.
దీనిపై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు గంగూలీ. భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్‌లు బాగానే ఉన్నాయని, కానీ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా పోటీ లేదని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థాయిలో చర్చల గురించి నాకు తెలియదు, కానీ వారు ఆడటం మంచిది. క్రీడలు వేరు, పాలిటిక్స్ వేరు అని అన్నాడు గంగూలీ. పాకిస్తాన్ జ‌ట్టు బ‌లంగా ఉండ‌వ‌చ్చు కాద‌న‌లేను. కానీ టోర్న‌మెంట్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా భార‌త జ‌ట్టు అన్ని జ‌ట్ల‌కంటే ముందంజ‌లో , టాప్ లో కొన‌సాగుతుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశాడు సౌర‌వ్ గంగూలీ.
The post క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయంకలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ అంశాల్లో