hyderabadupdates.com Gallery గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం post thumbnail image

ముంబై : స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో వ‌న్డే సీరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా 15 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. దేశీవాళి క్రికెట్ లో భాగంగా జ‌రుగుతున్న విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కొన‌సాగుతున్న మ్యాచ్ ల‌లో కేర‌ళ త‌ర‌పున ఆడుతున్న సంజూ శాంస‌న్ దుమ్ము రేపుతున్నాడు. తాజాగా సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించినా సెలెక్ట‌ర్లు ప‌ట్టించుకోక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు సంజూ శాంస‌న్ ఫ్యాన్స్. మ‌రో వైపు వికెట్ కీప‌ర్ గా వ‌న్డే ఫార్మాట్ లో ఎలాంటి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌క పోయినా రిష‌బ్ పంత్ తో పాటు శుభ్ మ‌న్ గిల్ కు చోటు క‌ల్పించారు.
కాగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ ప‌ట్ల కొన‌సాగుతున్న వివ‌క్ష‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు మాజీ క్రికెట‌ర్లు. మ‌రో వైపు సంజూ శాంస‌న్ తో పాటు బౌలింగ్ ప‌రంగా అద్బుతంగా బౌలింగ్ చేస్తూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో బెంబేలెత్తిస్తూ వికెట్లు తీస్తున్న ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని సైతం ప‌క్క‌న పెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఎవ‌రిని ఉద్ద‌రించేందుకు వ‌న్డే జ‌ట్టును ఎంపిక చేశారంటూ మండిప‌డుతున్నారు. క‌నీసం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో నైనా సంజూ శాంస‌న్ ను ఆడిస్తారో లేదోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు.
The post గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage : ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్‌ పేరుతో కిడ్నాప్‌ కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రుప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రు

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ శ‌నివారం మ‌రాఠా లోని బివాండి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని కోరుతూ కేసు దాఖ‌లు చేసింది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్.

కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి టైమ్‌లో అనేక సినిమాలతో పోటీగా విడుదల కావడం ఈ