hyderabadupdates.com movies చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి వస్తుందో చెప్పలేదు. నాలుగని ఒకరు ఇరవై అయిదని మరొకరు రెండు ఆప్షన్లు ప్రచారంలోకి తెచ్చారు. టాక్సిక్ ఒకవేళ వాయిదా పడే పక్షంలో ఆ డేట్ తీసుకుని జూన్ 4 లాక్ చేయాలనే ఆలోచనలో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. తేదీ సంగతి ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జరిగిపోతున్నాయి. మెయిన్ సెంటర్స్ డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారు.

పెద్దిని కాసేపు పక్కనపెడితే అసలు విశ్వంభర ఎందుకింత సైలెంట్ ఉందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ సమస్యని చెప్పి 2024 నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ఇప్పటిదాకా పని ఎంతదాక వచ్చిందో చెప్పలేదు. ఈలోగా దర్శకుడు వశిష్ఠ ఇంకోవైపు బాలకృష్ణకో కథ చెప్పి ఓకే చేయించుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండాల్సిన తను వేరే ట్రయిల్స్ లో ఉన్నాడానేది ఫ్యాన్స్ డౌట్.

దీనికి క్లారిటీ రావాలంటే ముందు చరణ్ డేట్ డిసైడ్ కావాలి. పెద్దికి విశ్వంభరకు కనీస గ్యాప్ ఉండాలనేది చిరంజీవి సూచన. అసలే యువి క్రియేషన్స్ ఇబ్బందుల్లో ఉందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఘాటీ డిజాస్టర్ అయ్యింది. కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ అనిపించుకున్నా తడిసిపోయే రేంజ్ లో కనకవర్షం కురవలేదు. బైకర్ ని అందరూ ఆకాశానికి ఎత్తే రేంజ్ లో పొగిడినా రెండు వారాల తర్వాత కూడా బ్రేక్ఈవెన్ చేరుకోలేదు. ఇప్పుడు విశ్వంభర సమస్య తీరాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఊరట కలిగించాల్సింది ఈ రెండు సినిమాలే. ముఖ్యంగా పెద్ది మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. విశ్వంభర ప్రస్తుతానికి హైప్ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నా రిపేర్ల తర్వాత అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. ఇప్పటికైతే రీ రికార్డింగ్ కోసం కీరవాణికి ఇంటిమేషన్ వెళ్లలేదట. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే కబురు పెడతారని తెలిసింది. ఎలా చూసినా విశ్వంభర జూలైలో రావడం దాదాపు ఫిక్స్.

Related Post

డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కూడా పాల్గొన్న

This Telugu actor was the first choice to play Murugan in KingdomThis Telugu actor was the first choice to play Murugan in Kingdom

Venkitesh VP, who impressed audiences with his performance as Murugan in Vijay Deverakonda’s Kingdom, wasn’t the first choice for the role. The latest news is that director Gowtam Tinnanuri had

I want to make a love story with Mahesh Babu says sensational young director
I want to make a love story with Mahesh Babu says sensational young director

Director Sai Marthand, who scored a blockbuster with Little Hearts, has become the talk of the town in Telugu cinema. The film, starring Mouli and Shivani Nagaram, turned out to