hyderabadupdates.com movies ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా జమానాలో దర్శకులు అన్నింటికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మొన్న జనవరిలో రాజా సాబ్ ఫలితం తేలిపోయాక మారుతీ వారాల తరబడి బయట కనిపించలేదు. మూడు నెలలు దాటిపోయినా కొత్త ప్రాజెక్టు లాక్ కాలేదు. స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ కాంబోలు గట్రా ఇంకా సెట్టవ్వాలి. ఇదంతా ఫ్లాప్ మహత్యమే తప్ప మరొకటి కాదు.

థియేటర్ నుంచి రాజా సాబ్ ఓటిటిలో వచ్చాక హెచ్డి క్లిప్స్ తీసుకొచ్చి మరీ ట్రోలింగ్ చేసారు అభిమానులు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. నెల రోజుల కన్నా ముందే డిజిటల్ లో వచ్చిన పవన్ కొత్త మూవీ అప్పుడే టార్గెట్ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వం, రైటింగ్ ని విమర్శిస్తూ గట్టిగానే తలంటుతున్నారు. శ్రీలీల సీన్లు, హీరోయిజంని అతిగా ఎలివేట్ చేయడం లాంటివి పాయింటవుట్ చేసి మరీ ప్రూఫ్స్ పెడుతున్నారు. ఇది కొన్ని రోజులు కొనసాగనుంది.

అలాని అందరూ నెగటివ్ అని కాదు కానీ కొందరు పాజిటివ్ గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. హరిహర వీరమల్లు కన్నా బెటరనే బ్యాచ్ భేషుగ్గా ఉంది. అయితే హరీష్ శంకర్ మాత్రం దేనికీ స్పందించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో రన్ అవుతున్నప్పుడు నిర్మాణ సంస్థ సైలెంట్ అయిపోయినా సరే తను మాత్రం ఎక్స్ లో కనిపించే ప్రతి పాజిటివ్ ట్వీట్ అదే పనిగా రీ కోట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచేవారు. ఈ ప్రమోషన్ వారం పైనే జరిగింది.

కానీ ఇప్పుడు మాత్రం హరీష్ శంకర్ రెస్పాండ్ అవ్వడం లేదు. వెంటనే స్పందిస్తే యాంటీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ చేస్తారని భావించారు కాబోలు సైలెంట్ గానే ఉంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే స్క్రీన్ మీద కనిపించబోవడం లేదు. సురేందర్ రెడ్డి సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కొత్త కమిట్ మెంట్స్ జరగలేదు. ఏడాది గ్యాప్ లోనే మూడు సినిమాలు ఇచ్చిన పవర్ స్టార్ పూర్తిగా పొలిటికల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో.

Related Post

కోటి మందికి గుడ్ న్యూస్ చెప్పిన పవన్కోటి మందికి గుడ్ న్యూస్ చెప్పిన పవన్

ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కోటి మందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది.. మహిళలకు నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో

రాజ్యాంగం వల్లే ప్రధానిగా ఛాయ్ వాలా!రాజ్యాంగం వల్లే ప్రధానిగా ఛాయ్ వాలా!

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది… బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన ఈ అత్యున్నత రాజ్యాంగం వల్ల ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన