hyderabadupdates.com movies టాక్సిక్ సంగతి త్వరగా తేల్చండి

టాక్సిక్ సంగతి త్వరగా తేల్చండి

జూన్ 4 టాక్సిక్ రావడం లేదని బెంగళూరు మీడియా గట్టిగానే చెబుతోంది. ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రకటన చేయకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తే వాయిదా సూచనలు పుష్కలంగా ఉన్నాయి. తెరవెనుక జరుగుతున్న వాటి గురించి గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం టాక్సిక్ ఇంకా ఓటిటి డీల్ జరుపుకోలేదు. నిర్మాణ సంస్థ ఆశిస్తున్న దాంట్లో సగమే ఇచ్చేందుకు డిజిటల్ కంపెనీలు సుముఖంగా ఉండటం వల్ల ఒప్పందం ఆగాయని వినికిడి.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు ప్రత్యేకంగా మార్కెట్ లో ఎలాంటి బ్రాండింగ్ లేదు. ప్రశాంత్ నీల్, సుకుమార్, రాజమౌళి లాగా ప్రాజెక్టుకి వేల్యూ యాడ్ చేసే కమర్షియల్ సినిమాలు తను తీయలేదు. వదిలిన టీజర్, ఒక లిరికల్ సాంగ్ పెద్దగా వైరల్ కాలేదు. కొంత కాంట్రావర్సీ రేగింది కానీ దాని వల్ల కలిగిన ప్రయోజనం తక్కువే. సరే ధర ఎక్కువ చెప్పినా పర్లేదు ముందు సినిమా చూపించమని ఒక ఓటిటి ఆడితే యష్ ససేమిరా అన్నాడని మరో కథనం ప్రచారంలో ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే టాక్సిక్ నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్ ప్రస్తుతం జన నాయకుడు టెన్షన్ లో ఉంది. సెన్సార్ వచ్చాక డేట్ ప్రకటించి బిజినెస్ పూర్తి చేయాలి. ఇప్పటికే పైరసీ తెచ్చిన తలనొప్పి వల్ల నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇంకోవైపు కన్నడ మూవీ కెడి డెవిల్ మీద అంతగా బజ్ ఏర్పడటం లేదు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తీసిందే. వీటి మధ్య మార్చిలోనే ప్రారంభం కావాల్సిన చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి మూవీని లేట్ చేయాల్సి వచ్చింది.

ఎలా చూసినా టాక్సిక్ జూన్ 4 రావడం లేదని కన్ఫర్మ్ అయినట్టే. జూన్ 25 పెద్ది ఫిక్స్ చేసుకుంది కాబట్టి దానికి ఎదురు వెళ్ళడానికి లేదు. జూలై లేదా ఆగస్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి రామాయణకు కనీసం నాలుగు నెలల గ్యాప్ ఉండాలనేది యష్ కోరికట. అది ఎంత మేరకు నెరవేరుతుందనేది టాక్సిక్ దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. కెజిఎఫ్ స్థాయిలో టాక్సిక్ కి బజ్ ఏర్పడకపోవడం ఈ సమస్యకు కారణం. ట్రైలర్ తో వాటికేమైనా సమాధానం చెబుతారేమో చూడాలి.

Related Post

Don’t Sleep: First-Of-Its-Kind Psychological ThrillerDon’t Sleep: First-Of-Its-Kind Psychological Thriller

Cinematographer-turned-director Shamdat, known for his striking visual work in films like Uppena, Virupaksha, Thandel, is stepping into Telugu direction with a first-of-its-kind psychological thriller. The film features Indhra Raam, who