hyderabadupdates.com Gallery డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్

డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్

డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్ post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు రోజు రోజుకు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఏప్రిల్ నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమ‌య్యాడు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. తాజాగా అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఏకంగా రాష్ట్రంలోని 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి టీవీకే పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాడు విజ‌య్. రాష్ట్ర ఎన్నిక‌ల్లో జాబితాను ప్ర‌క‌టించిన ఏకైక పార్టీ ఇదే కావ‌డం విశేషం. ఈ త‌రుణంలో ఆయ‌న పార్టీ కోసం ప‌ని చేస్తున్న వారిని, ముందు నుంచి త‌న‌ను న‌మ్ముకున్న వారికి ప్ర‌యారిటీ ఇచ్చాడు ఈ అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి.
ఇదిలా ఉండ‌గా విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. ఈ జాబితాలో త‌న‌తో కొన్నేళ్ల పాటు ఉంటూ , త‌న వ‌ద్ద డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్న వ్య‌క్తి కొడుక్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు. ఇది సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంద‌ర్బంగా త‌ను చ‌దువుకునేందుకు త‌న తండ్రి ఎంతో క‌ష్ట ప‌డ్డాడ‌ని తెలిపాడు విరుగుంబాక్కం టీవీకే అభ్యర్థి, 30 ఏళ్ల ఆర్. శబరినాథన్ . ఒక సామాన్యుడి నుండి రాజకీయ నాయకుడిగా తన ప్రయాణానికి ఇది ఒక పరిపూర్ణమైన ఆరంభం అని పేర్కొన్నాడు. శబరినాథన్ కన్నీళ్లు పెట్టుకోగా, నటుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచి, కౌగిలించుకున్న సహజమైన, భావోద్వేగ క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియో సంచ‌ల‌నంగా మారింది.
The post డ్రైవ‌ర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైర‌ల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణటిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా

తీర ప్రాంత అభివృద్ధి, మత్స్య రంగంపై ప్రత్యేక దృష్టితీర ప్రాంత అభివృద్ధి, మత్స్య రంగంపై ప్రత్యేక దృష్టి

అమ‌రావ‌తి/ విజ‌య‌వాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సింగపూర్ దేశ ప్రతినిధులతో విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో గ్లోబల్ కనెక్టివిటీ, ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు,