hyderabadupdates.com Gallery తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం post thumbnail image

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
పూర్వ కాలంలో మహా శివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పందాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరింది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.
తిరుపతి మహతి క్షేత్రంలో ఎం. సరళ బృందంచే శివస్తోత్ర పారాయణం, జి. ప్రభాకర్ శర్మచే పురాణ ప్రవచనం, సి. హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు. కపిలతీర్థంలో వి. ప్రసన్న లక్ష్మీ బృందంచే శివస్తోత్ర పారాయణం, శ్రీ ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, సి. హెచ్. జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం, శ్రీ వై. వేంకటేశ్వర్లుచే సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
అన్నమాచార్య కళామందిరంలో జి. ఇందిరారాణి బృందంచే శివస్తోత్ర పారాయణం, వి. నిర్మలా బాయ్ చే పురాణ ప్రవచనం, సి.హెచ్. అజయ్ కుమార్ బృందంచే పార్వతి పరిణయం నృత్య రూపకం, జె. కృష్ణ కుమారి చే పార్వతి పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులుచే శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు. రామచంద్ర పుష్కరిణిలో జె. రాజకుమారి బృందంచే శివస్తోత్ర పోరాయణం, కె. నారాయణ రావు చే పురాణ ప్రవచనం, సి. సాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివ లీలలు నృత్య రూపకం, ఎం. రాముడు ఆధ్వర్యంలో భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం నిర్వహిస్తారు.
The post తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sricharani: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిSricharani: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణి

    భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. ప్రపంచకప్‌ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్‌ అభినందించారు. వరల్డ్

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎంతిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా