మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఈ ఫ్రాంచైజ్ కు చెందిన డిజిటల్ హక్కులు తమకే చెందుతాయని, ఈ డీల్ సెటిల్ అయ్యేవరకు విడుదల ఆపాల్సిందిగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పెన్ స్టూడియోస్ రంగప్రవేశం చేయడం, రిలీజ్ కు అనుకూలంగా పరిణామాలు జరిగిపోవడం చకచకా జరిగాయి.నిజానికి దృశ్యం ఏప్రిల్ లోనే రావాల్సింది. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల దుబాయ్ లో విడుదల చేయలేమని గుర్తించి వాయిదా వేసుకున్నారు. ఈలోగా ఏవేవో జరిగిపోయాయి. క్రేజ్ ఉంది క్యాష్ చేసుకుందామని ఆ మధ్య దృశ్యం 2ని థియేటర్స్ లో మళ్ళీ విడుదల చేస్తే మోహన్ లాల్ అభిమానులే పట్టించుకోక పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఓటిటిలో డైరెక్ట్ రిలీజై అరిగిపోయిన సినిమా మీద డబ్బులు చేసుకుందామని వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టింది.ఇప్పుడీ దృశ్యం 3 తెలుగు డబ్బింగ్ ఉంటుందో లేదో వీలైనంత త్వరగా క్లారిటీ రావాలి. ఎందుకంటే వెంటనే రీమేక్ చేసేందుకు వెంకటేష్ అందుబాటులో లేరు. ఆదర్శ కుటుంబం అయిపోగానే అనిల్ రావిపూడి షూటింగ్ లో అడుగు పెట్టాలి. సో ఈ ఏడాది మొత్తం లాకైపోయినట్టే. ఒకవేళ తర్వాత చేద్దామా అంటే ఒరిజినల్ దృశ్యం 3 తాలూకు స్పాయిలర్స్, లీక్స్ అన్నీ సోషల్ మీడియాలో వచ్చేసి ఉంటాయి కాబట్టి కంటెంట్ మీద ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది.అటు హిందీలో అజయ్ దేవగన్ పూర్తిగా వేరే కథతో దృశ్యం 3 తీస్తున్నారు. అక్టోబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్ని భాషల్లో ఇది చివరి భాగం. ఇకపై హీరో పాత్ర శవాన్ని ఏం చేస్తుందనే సస్పెన్స్ ఉండదు. దర్శకుడు జీతూ జోసెఫ్ దానికో అర్థవంతమైన ముగింపు ఇచ్చినట్టు కేరళ మీడియా టాక్. ఈసారి థ్రిల్స్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశారని, అంచనాలు అతిగా పెట్టుకోకుండా గొప్ప అనుభూతి ఇస్తుందని పని చేసిన వాళ్ళు చెబుతున్నారు.
దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది
April 27, 2026April 27, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
Categories:
Related Post
Dies Irae beats Marco to become the biggest A-rated Malayalam openerDies Irae beats Marco to become the biggest A-rated Malayalam opener
November 2, 2025November 2, 2025|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
Pranav Mohanlal’s latest horror thriller, Dies Irae, directed by Rahul Sadasivan, hit the big screens yesterday and opened to positive reviews from critics. For the uninitiated, Rahul Sadasivan previously directed
Chaatu Chaatu Song from Purushaha Wins Hearts at College LaunchChaatu Chaatu Song from Purushaha Wins Hearts at College Launch
February 15, 2026February 15, 2026|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
The makers of the upcoming Telugu film Purushaha have unveiled the second single, Chaatu Chaatu, at a special event held with students at Kasturba Gandhi Degree and PG College for
Box Office: Ek Deewane Ki Deewaniyat nears the end of a Super Hit run; Harshvardhan Rane & Sonam Bajwa starrer collects 76 crore in 27 daysBox Office: Ek Deewane Ki Deewaniyat nears the end of a Super Hit run; Harshvardhan Rane & Sonam Bajwa starrer collects 76 crore in 27 days
November 17, 2025November 17, 2025|
Ai Generated Article, credits to ogrinal websiteAi Generated Article, credits to ogrinal website|
0 Comment|
12:09 am
Ek Deewane Ki Deewaniyat is looking to make its 4th weekend of Rs. 65 lakh to Rs. 70 lakh. The movie dropped with the arrival of a new release this