hyderabadupdates.com Gallery నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి గురించి నివేదిక‌ల‌తో కూడిన బుక్ లెట్ల‌ను సిద్దం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. తొలి బుక్ లెట్ ను శాస‌న స‌భ స‌భాప‌తి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడుకి ఇచ్చిన‌ట్లు తెలిపారు. స్పీక‌ర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 312 కోట్లు మంజూరు చేశామ‌న్నారు డిప్యూటీ సీఎం. ఇక ఇదే క్ర‌మంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంకి రూ. 487 కోట్లు కేటాయించామ‌న్నారు. ⁠పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన సీఎంకు ఈ సంద‌ర్బంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ⁠పల్లెల అభివృద్ది, ప‌చ్చ‌ద‌నం పెంపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నామ‌న్నారు .
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో తన పరిధిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్ లెట్ ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆవిష్కరించారు. నియోజక వర్గాలవారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైందని తెలిపారు. శాసనసభలో ఈ బుక్ లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్, నీటి తొట్టెల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు.
15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చారు.
The post నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్

అమ‌రావ‌తి : ఏపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌ధాని దేశ ప‌రువును గంగ‌లో క‌లిపాడని ఆరోపించారు. జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌క ప‌రిరక్ష‌ణ యాత్ర రాయ‌ల‌సీమ‌లో

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తివినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి, సునీల్ , స‌త్య‌, వెన్నెల కిషోర్

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.