hyderabadupdates.com Gallery న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హిళా ఐఏఎస్ ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛాన‌ల్ తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ల్స్ ల‌లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఆయా సామాజిక వేదిక‌ల ద్వారా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా న‌ల్ల‌గొండ జిల్లాలో రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌ద‌రు మ‌హిళా ఐఏఎస్ తో ప్రేమాయ‌ణం న‌డిపారంటూ సంచ‌ల‌న ప్ర‌త్యేక క‌థ‌నం ఎన్టీవీలో ప్ర‌సారం అయ్యింది. దీనిని ఆధారంగా చేసుకుని మిగ‌తా యూట్యూబ్ ఛాన‌ల్స్ కూడా పెద్ద ఎత్తున స్టోరీస్ తో పాటు చ‌ర్చ‌లు కూడా చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల‌లో పెను సంచ‌ల‌నం రేపింది. ఈ త‌రుణంలో మ‌హిళా ఐఏఎస్ ను వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్. ఈ మేర‌కు ఆయ‌న ఖండిస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. తాజాగా సోమ‌వారం అసోసియేష‌న్ త‌ర‌పున పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌హిళా ఐఏఎస్ , మంత్రికి లింకు పెడుతూ స్టోరీ టెలికాస్ట్ చేసిన ఎన్టీవీతో స‌హా పలు న్యూస్ చానల్స్, సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్. అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.
The post న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Manchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణుManchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు

    విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సికింద్రాబాద్ పై. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ చ‌రిత్ర‌ను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రో వైపు ఈ న‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంతా ప్ర‌భుత్వానికి

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులువ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భ‌క్తులు పోటెత్తారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా స‌ముద్రాన్నిత‌ల‌పింప చేస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర గనుల శాఖ