hyderabadupdates.com Gallery పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం

పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం

పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ కీల‌క స‌మావేశంలో మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కింజార‌పు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిపక్ష పార్టీ కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు.
దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆయా శాఖ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్పష్టం చేశారు. ఇప్ప‌టికే ఆయా మంత్రుల ప‌నితీరుపై స‌ర్వే కూడా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ముంద‌స్తుగా ర్యాంకులు కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించామ‌ని, దాని ఆధారంగా ప‌ని చేయాల‌ని మ‌రోసారి పేర్కొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం జరుగుతున్న శాస‌న స‌భ స‌మావేశాల‌లో ప్ర‌తి ప్ర‌శ్న‌కు సావ‌ధానంగా స‌మాధానం ఇచ్చేందుకు ప్రిపేర్ అయి ఉండాల‌ని అన్నారు. గ‌తంలో ప్ర‌భుత్వం అన్ని వ్య‌వ‌స్థ‌లను నిర్వీర్యం చేసింద‌ని, అది చేసిన నిర్వాకం కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింద‌న్నారు. దేశంలో పెట్టుబ‌డుల‌ను అత్య‌ధికంగా ఆక‌ర్షించిన చ‌రిత్ర ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మాత్ర‌మే ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌ర్కార్ ఆమోదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎంశ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా

విజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాంవిజ‌య‌వాడ‌ను మాడ‌ల్ న‌గ‌రంగా మారుస్తాం

విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివ‌నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్‌ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర