hyderabadupdates.com movies ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా లేదానే అనుమానాలు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వదిలిన హీరోయిన్ కయదు లోహర్ బర్త్ డే పోస్టర్లో మరోసారి తేదీని స్పష్టంగా పేర్కొన్నారు కానీ కేవలం వీటిని బట్టే మాట మీద ఉంటారన్న గ్యారెంటీ అయితే లేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 21 వదులుకునేందుకు సిద్ధంగా లేరు.

ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వచ్చింది కాబట్టి అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. అలాని కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి కూడా గమనించాలి. మళ్ళీ ఏ మాత్రం లేట్ అయినా దాని ప్రభావం నేరుగా బ్లడీ రోమియో మీద పడుతుంది. ఎందుకంటే దర్శకుడు సుజిత్ ఆల్రెడీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉన్నాడు. క్యాస్టింగ్ కూడా పేపర్ మీద రెడీగా ఉంది కానీ నాని డేట్స్ అందుబాటులోకి వస్తేనే ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకోవడానికి కుదురుతుంది. లేదంటే వృధా అవుతాయి.

ప్యారడైజ్ కోసం జుత్తు గెడ్డం బాగా పెంచేసిన నాని వాటిని ఇప్పట్లో తీసేయలేడు. బ్లడీ రోమియో గ్యాంగ్ స్టర్ డ్రామా కాబట్టి దాని లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల గుమ్మడికాయ కొట్టేసి పంపిస్తే కానీ సుజిత్ కొబ్బరికాయ కొట్టలేడు. గతంలో అయితే నానికి ఈ సమస్య లేదు. ఒకే లుక్ తో ఒకే టైంలో రెండు సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా సబ్జెక్టులతో అలా కుదరడం లేదు. మేకోవర్ ప్రతిదానికి వేర్వేరుగా విభిన్నంగా ఉంటున్నాయి.

ఒకేసారి వచ్చి క్లాష్ కు సిద్ధపడాలని ముందు అనుకున్న పెద్ది, ప్యారడైజ్ రెండూ ఒకే సమస్యని ఎదురుకుంటూ ఉండటం విచిత్రం. నిర్మాణం, పాటల చిత్రీకరణ, రాజీ లేని దర్శకుల మొండిపట్టు లాంటి కారణాల వల్ల ఫ్యాన్స్, ట్రేడ్ కోరుకున్న డేట్లకు ఇవి రాలేకపోతున్నాయి. నాని ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నాడు. ఇప్పటిదాకా అందని ద్రాక్షలా ఊరిస్తున్న హిందీ మార్కెట్ దీని దెబ్బతో ఎక్కడికో తీసుకెళ్తుందని ధీమాగా ఉన్నాడు. ఫ్యాన్స్ నమ్మకం కూడా అదే.

Related Post

Star hero’s latest hit film to fall short of Rs. 100 crore clubStar hero’s latest hit film to fall short of Rs. 100 crore club

Mollywood Megastar Mammootty recently came up with the crime thriller Kalamkaval, directed by newcomer Jithin K. Jose. In the film, the legendary actor played the role of a psychopath. Kalamkaval

‘OG’ Out on OTT But Pawan Kalyan Fans Await Thaman’s Treat – Deets Inside‘OG’ Out on OTT But Pawan Kalyan Fans Await Thaman’s Treat – Deets Inside

Pawan Kalyan’s They Call Him OG was a sensation during its theatrical run and became the highest-grossing Tollywood movie of 2025. The film was directed by Sujeeth and produced by

శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్