hyderabadupdates.com Gallery బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం post thumbnail image

ల‌క్నో : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్థి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టును ఓడించింది. రెండు ఓట‌ముల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం ఇది. ఆతిథ్య జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ గెలుపుతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీం 2వ ప్లేస్ లోకి వెళ్లింది. ఇక ల‌క్నో ప‌రంగా చూస్తే ఇది వ‌రుస‌గా ఆ జ‌ట్టుకు నాలుగో ప‌రాజ‌యం . ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 159 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. అంద‌రూ ల‌క్నో ఈ చిన్ని టార్గెట్ ను ఈజీగా ఛేదిస్తార‌ని అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో రాజ‌స్తాన్ బౌల‌ర్లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప‌రేషాన్ చేశారు ల‌క్నో బ్యాట‌ర్ల‌ను. దీంతో 18 ఓవ‌ర్ల‌లోనే 119 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది ల‌క్నో సూపర్ జెయింట్స్ .
రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను మిచెల్ మార్ష్ ఒక్కేడు ఎదుర్కొన్నాడు. త‌ను 41 బంతులు ఎదుర్కొని 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు సాధించాడు.త‌నే టాప్ స్కోర‌ర్. ఇక బౌలింగ్ ప‌రంగా మ‌రోసారి ఆర్చ‌ర్ స‌త్తా చాటాడు. త‌ను 4 ఓవ‌ర్లు వేసి 20 ప‌రుగులు చేసి 3 వికెట్లు తీశాడు.బ్రిజేష్, బ‌ర్గ‌ర్ చెరో 2 వికెట్లు కూల్చారు. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ర‌వీంద్ర జ‌డేజా ఒక్క‌డే స‌త్తా చాటాడు. య‌శ‌స్వి జైస్వాల్, వైభ‌వ్ సూర్య‌వంశీ లు నిరాశ ప‌రిచారు. వ‌రుస‌గా మ్యాచ్ లు ఓడి పోవ‌డంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్తానానికి ప‌డి పోయింది. పూరన్ 22 ర‌న్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
The post బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలిఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సింహాచలం చందనోత్స‌వానికి భారీ ఏర్పాట్లుసింహాచలం చందనోత్స‌వానికి భారీ ఏర్పాట్లు

విశాఖ‌పట్నం జిల్లా : సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని , మంత్రుల‌ను శాస‌న స‌భ వేదిక‌గా ఏకి పారేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వకుండా ఇబ్బందుల‌కు గురి చేస్తే ఎలా అని నిల‌దీశారు. ఇది